Ayaan: అల్లు అర్జున్ కొడుకులో అలాంటి టాలెంట్.. భలే ఉన్నాడంటూ?

Ayaan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది ‘పుష్ప’. ఈ సినిమాతో ఓవర్‌నైట్‌లో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ క్రియేటివిటీకి అల్లు అర్జున్ టాలెంట్ తోడవ్వడంతో ‘పుష్ప’ సునామీ నేటికి కొనసాగుతోంది. ఎక్కడా తగ్గేదే లే అన్నట్లుగా భారీ రేంజ్‌లో స్కెచ్చులేస్తున్నారు. పుష్ప-2తో పాన్ ఇండియా ఇమేజ్ నుంచి పాన్ వరల్డ్ క్రేజ్ దక్కేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘పుష్ప: ది రూల్’ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ మూవీని ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 20కిపైగా దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే బన్నీ రేంజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పుష్పలో శ్రీవల్లిగా కనిపించి యువత మనసు దోచుకున్న హీరోయిన్ రష్మిక పాత్ర కూడా మరింత అట్రాక్ట్ గా ఉండనుందని సమాచారం. దాక్షాయణి పాత్రతో మెప్పించిన యాంకర్ అనసూయ క్యారెక్టర్ పవర్‌ఫుల్‌గా కనిపించనుందట. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సాయిపల్లవి కూడా నటిస్తున్నారు.

 

అయితే బన్నీ వ్యక్తిగత విషయానికి వస్తే.. స్నేహారెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరికి అల్లు అయాన్, అల్లు అర్హ పిల్లలు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ఎక్కువగా వెకేషన్స్ ప్లాన్ చేస్తుంటారు. పిల్లలతో కలిసి టూర్ వెళ్తుంటారు. సోషల్ మీడియాలోనూ స్నేహారెడ్డికి, పిల్లలకి ఎంతో క్రేజ్ ఉంది. ప్రతిరోజూ పిల్లలకు సంబంధించిన అల్లరి వీడియోలను, ఫోటోలను ఎప్పటికప్పుడు స్నేహారెడ్డి షేర్ చేస్తుంటారు. అయాన్, అర్హ ఎప్పుడూ అల్లరి చేస్తూ కనిపిస్తుంటారు. అయితే చాలా వరకు నెట్టింట అర్హకు సంబంధించిన వీడియోలే కనిపిస్తుంటాయి. అర్హ చేసే అల్లరి, చిలిపి చేష్టలు, ముద్దు ముద్దు మాటలు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అయాన్ మాత్రం కొంచెం సైలెంట్‌గానే ఉంటాడు. నెట్టింట్లో కూడా ఎక్కువగా కనిపించడు. కానీ అప్పుడప్పుడు అయాన్ చేసే అల్లరి విన్యాసాలు నెట్టింట ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. అయితే తాజాగా అల్లు అయాన్‌కు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయాన్‌కు డ్రాయింగ్ అంటే ఎంతో ఇష్టమట. ఏ ఫోటో డ్రాయింగ్ వేయాలని అనుకున్నా జిరాక్స్ లా గీసి పడేస్తాడట. అలాగే పెద్దలంటే కూడా ఎంతో గౌరవమని, స్టార్ హీరో కొడుకుగా ఉన్నప్పటికీ చాలా సింపుల్‌గా అందరితో కలిసి మెలిసి ఉంటాడట. అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్లు అయాన్ టాలెంట్‌ను చూసి మురిసిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM YS Jagan: జగన్ పై దాడి చేసిన వస్తువు కూడా దొరకలేదా.. సాక్ష్యాలు మాయమయ్యాయా? మాయం చేశారా?

CM YS Jagan: ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ విషయంపై అనేక రకాల అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి....
- Advertisement -
- Advertisement -