Veera Simha Reddy: బాబాయే గ్రేట్.. వీరసింహారెడ్డిపై తారక్ కామెంట్లు విన్నారా?

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలను దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాలో పొందుపరిచాడు. దీంతో ఈ సినిమాకు తొలిరోజే పాటిజివ్ టాక్, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. బాలయ్య డైలాగులు, ఆయన యాక్షన్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.

ఈ సినిమాపై ఇప్పటికే చాలా మంది స్టార్లు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య నటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా స్పందించాడు. ఈ సినిమాలో బాబాయ్ అద్భుతంగా నటించాడని తారక్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బాబాయ్ గ్రేట్ అని.. కొన్ని సీన్లకు గూస్ బంప్స్ వచ్చాయని తారక్ పేర్కొన్నాడు. బాలయ్య బాబాయ్‌లా నటించడం ఎవరి వల్ల కాదని తెలిపాడు. తారక్ స్పందనతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది.

అటు స్టార్ హీరో ప్రభాస్ ఓ వైపు తన సినిమాలతో బిజీగా ఉంటూనే ఇటీవల వీరసింహారెడ్డి మూవీని వీక్షించాడు. ఈ మూవీని తన సోదరుడు ప్రమోద్‌తో కలిసి ప్రత్యేకంగా ఏఎంబీ థియేటర్‌లో చూశాడు. దీనికి సంబంధించి కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరసింహారెడ్డి మూవీలో పొలిటికల్ డైలాగులు కూడా ఉండటంతో ఈ సినిమాను రాజకీయ నేతలతో పాటు పలువురు ప్రముఖులు కూడా వీక్షిస్తుండటం హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.

వీరసింహారెడ్డి ఓటీటీ అప్‌డేట్
బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకుంది. హాట్ స్టార్ ఈ చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా 14కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -