Rayapati: బ్యాంకులకు డబ్బులు ఎగ్గొడుతున్న బాబు పార్టీ నేతలు.. రాయపాటి అన్ని వేల కోట్లు ముంచేశాడా?

Rayapati: టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో ఆయన అండ చూసుకొని బ్యాంకులను బురిడీ కొట్టించారు పార్టీ నేతలు. అయితే అలా బురిడీ కొట్టించిన ఒక్కొక్క నేతల చరిత్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఇప్పటికే సుజనా చౌదరి, సీఎం రమేశ్, నామా నాగేశ్వరరావు, జేసీ
బ్రదర్స్ తదితరులు అక్రమ వ్యాపారాలు, మనీ లాండరింగ్ కేసుల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాయపాటి సాంబశివరావు కూడా డొల్ల కంపెనీలతో మోసాలకి పాల్పడినట్లు తాజాగా తేలింది. కాగా రాయపాటి దేశంలోనే అతి పెద్ద లోన్ స్కామ్‌‌ని చేసినట్లు ఈడీ గుర్తించింది.

ఈడీ విచారణలో భాగంగా రాయపాటితో పాటుగా మరికొంత మంది పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు 13 బ్యాంక్‌లలో దాదాపుగా రూ.9394 కోట్లు రుణాలు తీసుకుని ఆ డబ్బుని షెల్ కంపెనీలకి తరలించారు. అనంతరం తనకి చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ బ్యాంకు ఖాతాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్‌కు ఈ నగదు బదిలీ అయిందని ఈడీ గుర్తించింది. 2019లోనే బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటి ఇల్లు, కార్యాలయాలపై సీబీఐ సోదాలు నిర్వహించింది. మంగళవారం మనీలాండరింగ్ కేసులో భాగంగా రాయపాటి ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో 15 చోట్ల సోదాలు నిర్వహించి కీలకమైన పత్రాల్ని స్వాధీనం చేసుకుంది.

 

ఆ రుణం ఇప్పుడు వడ్డీతో కలిపి దాదాపు 30 వేల కోట్లకు చేరినట్లు బ్యాంకులు తేల్చాయి. మనీలాండరింగ్ కేసుల భయంతో చంద్రబాబు సూచనల మేరకు అప్పట్లో సుజనా చౌదరి, సీఎం రమేశ్ ఆగమేఘా లపై బీజేపీలో చేరిపోయారు. రాయపాటి‌కి కూడా చంద్రబాబు ఇదే సలహా ఇచ్చినా ఆశ్చర్యపోలేం. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఎంత మంది టీడీపీ నేతలు ఇలా మనీలాండరింగ్‌కి పాల్పడ్డారు? అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు విశాఖలో గీతం యూనివర్సిటీ వాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వారిలో కలిపేసుకుంటారు. ఇక రామోజీ వంటివారు సైతం ప్రపంచానికి నీతులు చెప్పి తాముమాత్రం భారీగా అక్రమాలు చేస్తూ డబ్బు పోగేస్తారు. అయితే ఇలాంటి వారంతా బాబు అండచూసుకొని వేలకోట్లు పోగేస్తారు. దానికి చంద్రబాబు సపోర్ట్ కూడా ఉంటుంది. అలా వచ్చిన డబ్బు మళ్ళీ పార్టీ కోసం ఎన్నికల కోసం ఖర్చు చేసి తమ రుణం తీర్చుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -