Megastar: వైష్ణవిపై మెగాస్టార్ చేసిన కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Megastar: ఇటీవలె ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల సునామీని సృష్టించింది బేబీ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి బాగా నచ్చడంతో ఈ సినిమాను రిపీటెడ్ గా చూస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది బేబీ సినిమా. సమకాలీన ప్రేమ ఎలా ఉంటుందో అన్న కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు ఊహించని రీతిలో భారీ స్పందనను అందించారు. ఇప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఇది కలెక్షన్ల సునామీని సృష్టించింది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరుతో ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. దీనికి చీఫ్ గెస్టుగా వచ్చిన చిరంజీవి చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించి, ఒక మెసేజ్‌ను ఇచ్చారు. కాగా కాంటెంపరరీ లవ్ స్టోరీతో తెరకెక్కిన బేబి మూవీ సంచలన విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా హైదరాబాద్‌లో మెగా కల్ట్ సెలెబ్రేషన్స్ పేరిట ఒక ఈవెంట్‌ను నిర్వహించింది. దీన్ని చాలా తక్కువ మందితో నిడారంభరంగా జరపగా ఆ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో చిరంజీవి మాట్లాడుతూ.. నాకు పుత్రోత్సాహం తెలుసు. తమ్ముడు, మేనల్లుళ్ల సక్సెస్ చూశాను.

 

ఇప్పుడు నన్ను చూసి ఇన్‌స్పైర్ అయి ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్ల సక్సెస్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా అభిమానులు మారుతి, ఎస్‌కేఎన్, సాయి రాజేష్ వంటి వాళ్లు ఇప్పుడు విజయాన్ని అందుకోవడం గర్వంగా అనిపిస్తుందని తెలిపారు. అనంతరం వైష్ణవి గురించి మాట్లాడుతూ.. వైష్ణవి బస్తీలో అమ్మాయి నుంచి కాలేజ్ వరకు నటనలో పర్ఫామెన్స్ పరంగా చూసినా ఎంతో మెచ్యూర్డ్‌గా చేసింది. ఎన్ని సినిమాల ఎక్స్‌పీరియెన్స్ ఉందో అనుకున్నా, కానీ మొదటి సినిమాకే ఇలా చేసిందా అని ఆశ్చర్యపోయా. సహజ నటి జయసుధ గారిని తలపించే నటి నాకు తారసపడలేదు. వైష్ణవిని చూస్తుంటే నాకు అలా అనిపించింది. ఎంతో ఇంటెన్స్‌గా నటించింది. గ్లామర్, డీ గ్లామర్‌గా కనిపించింది. ఆమెకు ఎంతో భవిష్యత్తు ఉంది అని తెలిపారు చిరంజీవి.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -