Balagam: బలగం నటి కన్నీటి కష్టాలివే.. అయ్యో పాపమంటూ?

Balagam: బలగం.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు మారు మోగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే సినిమా గురించి చర్చించుకుంటున్నారు. ఈ సినిమా ఓటీటీ లో కూడా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే. ఇటీవలే ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడంతోపాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా ఈ సినిమాను చూసిన తర్వాత చాలామంది ఆడవారు మగవారు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా కొన్ని ఏళ్లుగా కోపాలు పంతాలతో దూరంగా ఉన్న చాలా కుటుంబాలు ఈ సినిమా కారణంగా కలిసాయి అని చెప్పవచ్చు..

 

ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయు. అలాగే సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా కంటతడి పెట్టాల్సిందే. మరి ముఖ్యమైన క్లైమాక్స్ సన్నివేశంలో ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల గుండెలను హత్తుకుంటాయి. ఇకపోతే ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన విషయం తెలిసిందే. మిగిలిన నటీనటులు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేని వారే. కానీ ఈ సినిమాతో ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ఈ సినిమాలో నటీనటులు నటనకు గాను మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ సినిమాలో నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సౌదామిని కూడా ఒకరు.

సౌదామిని ఇందులో ప్రియదర్శి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా నటించిన విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా కొమురయ్య చనిపోయినప్పుడు కాబోయే భర్త ఇంటికి రావడం ఆ సమయంలో ఆమె ఎటువంటి మాటలు మాట్లాడకుండా కేవలం సైగలు ఎక్స్ప్రెషన్స్ తోనే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఆ సన్నీవేషంలో ఒక్క డైలాగ్ లేకపోయినా తన ఎక్స్‏ప్రెషన్స్‏తో బాగా ఫేమస్ అయ్యింది సౌదామిని. ఇది ఇలా ఉంటే ఇటీవల ఇంటర్వ్యూ పాల్గొన్న సౌదామిని తన కెరియర్ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పకు వచ్చింది. ఆర్టిస్ట్ కావాలి అన్న కోరికతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాను. బలగం సినిమా కోసం ఏకంగా 10 కేజీల బరువు కూడా పెరిగాను.

 

ఆడిషన్స్ కు వెళ్ళినప్పుడు నన్ను సిగ్గుపడమని చెప్పారు. సిగ్గు పడగానే వెంటనే నన్ను సెలెక్ట్ చేశారు. సౌదామిని పేరును వేణు సర్ సౌమ్య పిలిచారు. ఈ సినిమాలో ప్రియదర్శి చాలా సపోర్టింగ్ గా ఉన్నారు తెలిపింది సౌదామిని. నాకు ఎక్కువగా ఫన్ జోనర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. నా మొదటి సినిమా బలగం. బీఎస్సీ ఫస్ట్ ఇయర్ లోనే చదువు ఆపేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. కానీ ఎక్కడికి వెళ్లిన కూడా నీ ముఖానికి హీరోయిన్ అవుతావా అంటూ హేళన చేసే వాళ్ళు అని చెప్పకొచ్చింది సౌదామని. ఈరోజు నేను ఈ స్థాయికి రావడం కారణం వేణు సార్. బలగం సినిమా చూసిన తర్వాత డైరెక్ట్ అనుదీప్ కాల్ చేసి మా సినిమాలోని మంచి క్యారెక్టర్ ఇస్తామని చెప్పారు అప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పకొచ్చింది సౌదామిని.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -