Akhanda: సోలోగా రిలీజ్ చేసినా బాలయ్య సింహమే.. పండుగలకు బాలయ్య దూరమా?

Akhanda: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా పండగలను టార్గెట్ చేస్తూ సినిమాలను విడుదల చేస్తారు. ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద పండుగ బరిలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలవుతూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ రూట్ మాత్రం సెపరేట్ అని చెప్పాలి.ప్రస్తుతం ఈయనతో పాటు హీరోలుగా ఇండస్ట్రీలో కొనసాగిన చిరంజీవి నాగార్జున వంటి హీరోలు పండుగలను నమ్ముకుంటూ ఉండగా బాలకృష్ణ మాత్రం సోలోగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగారు.

బాలకృష్ణ చాలా సంవత్సరాలు తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదలైంది.అయితే ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయింది.ఈ సినిమా విడుదల సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంగా పలుచోట్ల థియేటర్లు కూడా పెద్దగా ఓపెన్ కాలేదు అలాగే ఏపీలో టికెట్ల రేట్లు కూడా భారీగా పడిపోయాయి.

ఇలా ఎన్నో క్లిష్ట పరిస్థితుల నడుమ బాలకృష్ణ ధైర్యం చేసి అఖండ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.అయితే ఈ సినిమా ఊహించని విధంగా థియేటర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఈ విధంగా బాలకృష్ణ ఎలాంటి పండుగలను టార్గెట్ చేయకుండా కేవలం సోలోగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.డిసెంబర్ రెండవ తేదీ విడుదలైన ఈ సినిమా మొదట్లో నెగిటివ్ రివ్యూలను ఎదుర్కొన్నప్పటికీ కలెక్షన్ల సునామి సృష్టించింది.

బాలయ్య ద్విపాత్రాభినయంలో ఎంతో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఇందులో బిజిఎం అదిరిపోయిందని చెప్పాలి. ఇలా మ్యూజికల్ పరంగా సినిమా అద్భుతంగా హిట్ అయింది. ఇక మరోసారి బోయపాటి తన మార్క్ ఏంటో ఈ సినిమా ద్వారా చూపించారు.మొత్తానికి ఎలాంటి పండుగలను నమ్ముకోకుండా కేవలం సోలోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డులను సృష్టించడమే కాకుండా ఎన్నో సినిమాలకు ధైర్యం నింపిందని చెప్పాలి.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -