Balakrishna-Pawan Kalyan: పవర్ స్టార్ పై బాలయ్యకు ఇంత అభిమానమా.. షాకింగ్ విషయాలు రివీల్?

Balakrishna-Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు విరామం ఇచ్చి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈయన రీ ఎంట్రీ తర్వాత నటించిన సినిమాలలో భీమ్లా నాయక్ ఒకటి. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్నటువంటి అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకి రీమేక్ చిత్రంగా ఈ సినిమా తెలుగులో భీమ్లా నాయక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీగా రానా డానియల్ శేఖర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఇకపోతే ఈ సినిమా సక్సెస్ వెనుక బాలకృష్ణ హస్తం ఉందని తాజాగా అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా తెలుస్తోంది.బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహాలో అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం మొదటి సీజన్ ఎంతో సక్సెస్ కావడంతో రెండవ సీజన్ ప్రసారమవుతుంది అయితే రెండవ సీజన్ కి రెండవ ఎపిసోడ్లో భాగంగా యంగ్ హీరోలైనటువంటి డిజె టిల్లు, విశ్వక్ సేన్ హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో నిర్మాత నాగ వంశీ కూడా కొంత సమయం సందడి చేశారు.

ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో భాగంగా భీమ్లా నాయక్ సినిమా గురించి బాలకృష్ణ పలు ఆసక్తికరమైన ప్రశ్నలు వేయడంతో వాటికి నాగ వంశీ సమాధానం చెప్పారు. అయితే ఆయన చెప్పినటువంటి సమాధానాలు వినపడకుండా ప్రోమో కట్ చేశారు.ఈ క్రమంలోనే తాజాగా ఈ ఎపిసోడ్ ప్రసారం కావడంతో భీమ్లా నాయక్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వంశీ వెల్లడించారు.ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ ఎవరు అంటూ బాలకృష్ణ ప్రశ్నించగా వెంటనే నాగ వంశీ మీరే కదా సార్ అంటూ సమాధానం చెప్పారు.

నేను మీ చుట్టూ తిరుగుతుంటే మీరు మాత్రం ఈ కథ పవన్ కళ్యాణ్ గారికి కరెక్ట్ గా సరిపోతుంది అంటూ ఆయనకు సూచించారంటూ నాగ వంశీ సమాధానం చెప్పారు. మరి ఈ మధ్యకాలంలో వరుస సినిమాలతో బాగా డబ్బు సంపాదిస్తున్నావ్ వాటిని ఏం చేస్తున్నావంటూ బాలయ్య ప్రశ్నించారు. తరువాత సినిమాలలో ఇన్వెస్ట్ చేస్తున్నానని వంశీ సమాధానం చెప్పారు. మొత్తానికి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను కరెక్ట్ గా అంచనా వేసి ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి సరిపోతుంది అంటూ సూచించడంతో ఎంతోమంది అభిమానులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ అంటే బాలయ్యకు ఎంత అభిమానం అంటూ కామెంట్ లు చేస్తున్నారు. అలాగే మరికొందరు పవన్ కళ్యాణ్ గురించి బాలయ్య సరిగ్గానే అంచనా వేశారు అందుకే భీమ్లా నాయక్ బ్లాక్ బాస్టర్ అయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -