NTR: బాలయ్యే నాకు గురువు, దైవం.. ఎన్టీఅర్ అలా కామెంట్స్ చేశారా?

NTR: నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. తారకరత్న పెద్దకర్మలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ను పలకరించలేదని చాలామంది తారక్ అభిమానులు ఫీల్ కావడంతోపాటు బాలయ్య లేదా తారక్ స్పందిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి హీరోలు ఎప్పుడూ కలిసే ఉండాలని ఫ్యాన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలయ్య సన్నిహితులు మాత్రం బాలయ్య, తారక్ మధ్య గ్యాప్ ఉన్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు.

 

చిన్నచిన్న మనస్పర్ధలు ఏ కుటుంబంలో అయినా సాధారణం అని వాటిని మరీ భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. నందమూరి హీరోలు మీడియా ముఖంగా తమ మధ్య మాటలు లేవని చెప్పలేదని కొంతమంది చెబుతున్నారు. తారకరత్న ఆస్పత్రిలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు బాలయ్య ప్రతిదీ చూసుకున్నారు. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ నటనను సైతం కొన్ని నెలల క్రితం ప్రశంసించారని ఫ్యాన్స్ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

అనవసరంగా బాలయ్యను టార్గెట్ చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ ఒకరి గురించి మరొకరు పలు సందర్భాల్లో పాజిటివ్ గానే కామెంట్లు చేస్తుండటం గమనార్హం. బాలయ్య తారక్ ప్రస్తుతం వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య అంటే ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి. ఆ అభిమానాన్ని మరోసారి అమెరికా వేదికగా చూపించారు జూనియర్ ఎన్టీఆర్.

ఆర్ఆర్ఆర్ మూవీ టీం అంతా ఆస్కార్ ఈవెంట్ కు అమెరికాకు వెళ్లింది. అక్కడ బిజీ బిజీగా గడుపుతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం తమ ఫ్యాన్సుతో ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే బాబాయ్ పై ఉన్న ప్రేమను మరోసారి జూనియర్ చూపించినట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ వేదిక దగ్గర అందరితో మాట్లాడుతూ బాలయ్య బాబాయ్ గొప్పదనం గురించి బాలయ్యే నాకు గురువు, దైవం అని ప్రాణాలైనా బాలయ్య కోసం ఇస్తానని చెప్పినట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -