Balayya-Mahesh: కూతుళ్లను పెంచే విషయంలో బాలయ్య, మహేష్ బాబు తోపులు.. ఈ హీరోలు నిజంగా గ్రేట్ అంటూ?

Balayya-Mahesh: ఒకప్పుడు పిల్లలను పెద్దలు ఎంతో క్రమశిక్షణతో పెంచేవారు వారి వ్యవహార శైలి ప్రవర్తన తీరు పెద్దలకు ఇచ్చే గౌరవం అన్నీ కూడా చాలా మంచిగా పిల్లలకు తెలియజేసే వారు కానీ ప్రస్తుత కాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రులలో ఎన్నో మార్పులు వచ్చాయి. తమ పిల్లలు ఎలాంటి కష్టాలు పడకూడదని కష్టం విలువ పిల్లలకు తెలియకుండా పెంచుతున్నారు. అయితే ఇలా పిల్లలను పెంచడం చాలా పెద్ద తప్పు అనే విషయం మనకు తెలిసిందే. అలాగే ఎవరితో ఎలా వ్యవహరించాలి పెద్దలకు ఎలా గౌరవం ఇవ్వాలి అనే విషయాలను కూడా పిల్లలకు పెద్దలు తెలియజేయడం లేదు.

సెలబ్రిటీల విషయానికి వస్తే పిల్లలను మరింత ముద్దుగా పెంచుతున్నారని చెప్పాలి. మేము సెలబ్రిటీల పిల్లలము అనే గర్వం కూడా వారిలో కనపడుతుంది. ఇలా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి ఎంతో మంది సినీ సెలబ్రెటీల పిల్లలు ఇప్పటికే వారి తొందరపాటు నిర్ణయాల వల్ల ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్న సంఘటనలను మనం చూస్తున్నాము. అయితే పిల్లలను పెంచే విషయంలో ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే బాలయ్య గ్రేట్ అని చెప్పాలి.

బాలకృష్ణకు ఇద్దరు కుమార్తెలు అయినప్పటికీ వీరిద్దరిని కూడా ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేయలేదు. వారిని ఎంతో క్రమశిక్షణగా పెంచడమే కాకుండా ఉన్నత చదువులు చదివించి మంచి కుటుంబానికి కోడలిగా పంపించారు. ఒకరు మాజీ సీఎం ఇంటికి కోడలుగా వెళ్ళగా మరొకరు విద్యాసంస్థల అధినేత అయినటువంటి భరత్ అనే వ్యక్తికి చిన్న కుమార్తెను ఇచ్చే వివాహం చేశారు. ఇలా బాలకృష్ణ కుటుంబాలకు ఎంతో సినీ రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ బాలయ్య పిల్లలు మాత్రం ఇండస్ట్రీకి చాలా దూరంగా వారి సొంత బిజినెస్ లలో దూసుకుపోతున్నారు.

ఇక మహేష్ బాబు కూడా అదే విధంగా తన పిల్లలను పెంచారనే చెప్పాలి. మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ సితారలకు చిన్న వయసు నుంచి ఇతరులకు సహాయం చేయడం ఇతరులకు గౌరవం ఇవ్వడం అనే విషయాలను ఎంతో చక్కగా నేర్పిస్తున్నారు. ఇదివరకే మనం గౌతం సితార ఇద్దరు కూడా పలుసేవ కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి సంఘటనలను మనం చూస్తున్నాము. తమ సంతోషంగా బ్రతకడంలో సంతోషం లేదని ఇతరుల జీవితాలలో సంతోషం తీసుకొచ్చినప్పుడే మనం కూడా సంతోషంగా ఉండగలం అనే విషయాలను మహేష్ బాబు నమ్రత తన పిల్లలకు ఎంతో చక్కగా వివరిస్తూ వారిని పెంచుతున్నారని చెప్పాలి ఇలా పిల్లలను పెంచే విషయంలో ఈ ఇద్దరు హీరోలు తోపు అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -