Balayya Young Tiger: బాలయ్య, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసిపోయారుగా.. విమర్శలు చేసేవాళ్లు ఇకపై నోరు మూయాలంటూ?

Balayya Young Tiger: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నందమూరి హీరోలు బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ నందమూరి హీరోలే అయినప్పటికీ ఎవరికి వారు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. బాలయ్య బాబుకు రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ కు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒకే చోట ఒకే స్టేజిపై కనిపిస్తే చూడాలని ఎంతోమంది నందమూరి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు.

అటువంటి సందర్భాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయని చెప్పవచ్చు. ఇటీవల తారకరత్న చనిపోయిన సమయంలో బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాలలో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా నందమూరి అభిమానులు సంతోషపడే సంఘటన ఒకటి జరిగింది. అదేమిటంటే బాలయ్య బాబుకి ఎన్టీఆర్ సెకండ్ ఇచ్చాడు. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా. నిన్న మొన్నటి వరకు వీరిద్దరి మధ్య సరైన సఖ్యత లేదని, బాలయ్య బాబు ఎన్టీఆర్ ని శత్రువులా చూస్తున్నాడు అంటూ ఇలా అనేక రకాల వార్తలు వినిపించాలి.

 

తారకరత్న మరణం విషయంలో బాలయ్య ఎన్టీఆర్ తో ఎంత దూరంగా కనిపించారో సుహాసిని కొడుకు పెళ్ళిలో ఎన్టీఆర్ అందరిని పలకరించుకుంటూ వెళుతూ బాబాయ్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడం అందరిని ఆకర్షించింది. మరి బాలకృష్ణ ఎన్టీఆర్ తో మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు అంటూ తారకరత్న పెద్ద కర్మ అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు చూసిన నందమూరి అభినులు చాలా బాధపడ్డారు. కానీ హరికృష్ణ కూతురు సుహాని కొడుకు పెళ్ళిలో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఆ క్రమంలోనే బాలకృష్ణని, రామకృష్ణని అందరిని ఎన్టీఆర్ పలకరించిన తీరుకి నందమూరి అభిమానులు ఉప్పొంగిపోయారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -