Balayya: బాలయ్య అనిల్ మూవీ హక్కులకు దిమ్మతిరిగే రేటు.. ఎంతంటే?

Balayya: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒక సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటూ, టాక్ షోలు చేస్తూ దూసుకుపోతున్నారు. వయసు పెరుగుతున్న కూడా ఇప్పటికీ అదే ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పిస్తూ అలరిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.

ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ సంవత్సరం మొదట్లో సంక్రాంతి పండుగకు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల కీలకపాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది దసరా పండుగకు కానుకగా విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.

 

అదేమిటంటే ఈ సినిమా డిజిటల్ హక్కులను ఫ్యాన్సీ రేట్ కు అమ్మేసారు. అమెజాన్ ప్రైమ్ సంస్థకు దాదాపు 36 కోట్ల మేరకు డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. సినిమా మిగిలిన బిజినెస్ ఇంకా టచ్ చేయలేదు. శాటిలైట్, హిందీ డబ్బింగ్, అడియో వుండనే వున్నాయి. బాలయ్య అనిల్ రావిపూడి సినిమాకు కాస్త భారీగానే అవుతోంది బడ్జెట్. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతున్నట్టు తెలుస్తోంది. జ్

కాబట్టి నాన్ థియేటర్ మీద కనీసం 60 నుంచి 70 కోట్ల వరకు రాబట్టగలగాలి. అప్పుడే థియేటర్ మీద బర్డెన్ తగ్గుతుంది.

అక్టోబర్ 19 లేదా 21న ఈ సినిమా థియేటర్ లోకి వస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -