Balayya: అక్కడ పూజలు చేసిన బాలయ్య.. ఇండస్ట్రీ హిట్టేనా?

Balayya: నటసింహ నందమూరి బాలకృష్ణ ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమాలతో పాటు టాక్ షో తో కూడా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ నందమూరి హీరో ఇటీవల యాడ్స్ రంగంలో కూడా అడుగుపెట్టారు. ఇప్పటివరకూ యాడ్స్ కి దూరంగా ఉన్న బాలకృష్ణ తన రూల్ ని అతిక్రమించి యాడ్స్ లో నటించారు. ఆ యాడ్స్ కి మంచి పేరు వచ్చింది. దీంతో ఆయన మరిన్ని యాడ్స్ లో కనిపించే అవకాశం లేకపోలేదు.

బాలయ్య బాబు దేవుడ్ని నమ్ముతాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం పూజ తోనే ఆయన రోజు మొదలు అవుతుంది. తరచుగా గుళ్ళకి కూడా వెళుతూ ఉంటారు బాలయ్య బాబు. టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న భక్తులు ఎవరంటే ముందుగా మనకి గుర్తుకు వచ్చే పేరు నందమూరి బాలకృష్ణ.

ప్రత్యేక పూజలు చేసిన బాలకృష్ణ!

అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ పెద్ద గుడిలో ప్రత్యేక పూజలు చేశారట. ప్రముఖ దేవాలయం మంత్రాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేసినట్టుగా చెప్తున్నారు. దేవుడ్ని నమ్ముతాడు కాబట్టి నందమూరి బాలకృష్ణకి కొన్ని నమ్మకాలు ఉన్నాయి. దాన్ని సందర్భంగా ఈ పూజలు చేశారట.

రాబోయే సంక్రాంతికి వీరసింహారెడ్డి చిత్రంతో థియేటర్లలో సందడి చేయబోతున్న నందమూరి బాలకృష్ణ ఇటీవలే ఒక చిత్రాన్ని అనౌన్స్ చేశారు. సక్సెసఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం బాలయ్య బాబు 108 చిత్రం కాబట్టి ప్రస్తుతానికి #NBK 108 గా పేరు పెట్టారు. ఈ చిత్రాన్ని అనౌన్స్ చేసే సందర్భంలో బాలకృష్ణ, మిగతా బృందంతో కలిసి మంత్రాలయం దేవాలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేశారు.ఈ చిత్రం మీద బాగా శ్రద్ధ పెట్టారట అనిల్ రావిపూడి. బాలక్రిష్ణని ప్రత్యేకంగా చూపించబోతున్నారట. యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఇందులో బాలకృష్ణ కూతురుగా కనిపించనుంది అని సమాచారం. చూడాలి మరి దర్శకుడు ఈ రేంజ్ లో బాలకృష్ణ ని చూపించబోతున్నాడో ఈ మాస్ ఎంటర్టైనర్ లో.

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -