Balayya-Ajith Kumar: అజిత్ కు చెక్ పెట్టిన బాలయ్య.. ఏమైందంటే?

Balayya-Ajith Kumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న బడా స్టార్ హీరో నందమూరి బాలయ్య. నందమూరి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలయ్య.. తనదైన డైలాగ్ డెలివరీ, నటనతో అందరికీ ఆకట్టుకుంటున్నారు. తెలుగు ఇండస్ట్రీలో రిజిస్టర్డ్ అభిమానులు అత్యధికంగా కలిగిన హీరోగా బాలయ్య నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుండగా.. ఈ సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా థియేటర్లలో సందడి చేస్తున్నాడు.

 

డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ లుక్ లో, మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ కథతో సంక్రాంతి బరిలో నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా రాబోతున్నాడు. అయితే నందమూరి బాలయ్యకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదీగాక బాలయ్యకు బాగా కలిసి వచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా అవడం, సెంటిమెంట్ కు తగ్గట్టుగా టైటిల్ లో సింహా ఉండటంతో ఈ సినిమా హిట్ అవుతుందనే టాక్ ముందు నుండి సాగుతోంది.

 

నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’ దెబ్బకు తమిళ సినిమా ‘తెగింపు’కు విలవిలలాడుతోంది. అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన తెగింపు సినిమాకు టాక్ కాస్త అటు ఇటుగా ఉండగా.. బాలయ్య సినిమా విడుదల అవుతుండటంతో.. థియేటర్ల యజమానులు అజిత్ సినిమాను తీసి.. బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాను వేసుకుంటున్నారు.

 

తెలుగు రాష్ట్రాల్లో పర్లేదు అనేలా థియేటర్లను సాధించిన అజిత్ కుమార్ ‘తెగింపు’కు బాలయ్య సినిమా గట్టి దెబ్బ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని 90శాతం థియేటర్లలో అజిత్ కుమార్ ‘తెగింపు’ సినిమాను తీసివేసి బాలయ్య బాబు ‘వీరసింహారెడ్డి’ని ప్రదర్శిస్తున్నారు. దీంతో ‘తెగింపు’ సినిమాకు తెలుగులో భారీగా నష్టం కలుగుతోంది. తెలుగులో కనీసం ఓపెనింగ్స్ కూడా రావట్లేదని సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh Assembly Elections: గులకరాళ్లతో, పసుపు చీరలతో రాజకీయాలు.. ఏపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?

Andhra Pradesh Assembly Elections: మరొక రెండు వారాలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతున్నటువంటి నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ విధంగా ఎన్నికల త్వరలో జరగబోతున్నటువంటి...
- Advertisement -
- Advertisement -