Balayya: అతిపెద్ద పొరపాటు చేస్తున్న బాలయ్య.. ఛీఛీ అలాంటి దర్శకుడా?

Balayya: సినిమా ఇండస్ట్రీ లోకి వారసులు రావడం అనేది మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఇప్పటికే చిరంజీవి కొడుకు నాగార్జున కొడుకు ఎంట్రీ ఇచ్చి వాళ్ల అదృష్టాలని పరీక్షించుకున్నారు. వెంకటేష్ వారసుడు ఇప్పుడప్పుడే ఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. ఇక మిగిలింది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ. అతని ఎంట్రీ ఇదిగో అదిగో అంటూనే రోజులు గడిచిపోతున్నాయి.

ఇన్ని రోజులు మోక్షజ్ఞ కి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్నది లేనిది తెలియక బాలయ్య ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. జాతకాలను నమ్మే బాలయ్య కూడా 2024 తర్వాత మోక్షజ్ఞకు జాతకరీత్యా మంచి సక్సెస్ ఉన్నట్లు తెలుసుకున్నాడు అందుకే ఎన్నికల తరువాత మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది.

 

అయితే ఏ దర్శకుడు ద్వారా బరిలోకి దించాలా అని ఆలోచనలో ఉన్న బాలయ్యకి పూరి జగన్నాథ్ బెస్ట్ ఆప్షన్ గా కనిపించినట్లు ఉన్నాడు అందుకే మోక్షజ్ఞ మొదటి సినిమాని బాలయ్య పూరి చేతుల్లో పెడుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం తీవ్ర నిరాశకి గురయ్యారు.

 

ఆ దర్శకుడు అవసరమా ఇప్పటికే లైగర్ తో పెద్ద ఫ్లాప్ ని ఇచ్చి లైమ్ లైట్ లేకుండా పోయాడు అలాంటి దర్శకుడి చేతిలో కొడుకుని కొడుతున్నాడు బాలయ్యకి అసలు బుద్ధి లేదా అంటూ వాపోతున్నారు నందమూరి అభిమానులు. నందమూరి వారసుడిని లాంచ్ చేసే విషయంలో బాలయ్య మరొకసారి ఆలోచించాలని లేనిపక్షంలో ఇదే బాలయ్య చేసే అతి పెద్ద పొరపాటు అవుతుంది.

 

అయినా బాలయ్య పోయి పోయి అలాంటి దర్శకుడు చేతిలో కొడుకు భవిష్యత్తు పెడుతున్నాడు ఏంటి అంటున్నారు నందమూరి అభిమానులు. ఇప్పటికే యాక్టింగ్ డాన్సులకు సంబంధించి శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞ తన బాడీ వెయిట్ లాస్ తరువాత కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ తర్వాత అంత తక్కువ వ్యవధిలో వెయిట్ లాస్ అయి మంచి లుక్ తో కనిపించిన మోక్షజ్ఞ అందరి దృష్టిని ఆకర్షించాడు.

 

Related Articles

ట్రేండింగ్

Chiranjeevi: చిరంజీవిపై విషం చిమ్మడం పాత్రికేయమా.. ఇది వ్యభిచారం కాదు వెబ్ చారమ్ అంటూ?

Chiranjeevi: ప్రస్తుత కాలంలో ఒక్కొక్క మీడియా సంస్థ ఒక్కొక్క రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకించి చానల్స్ పెట్టుకోవడం కూడా గమనార్హం. అయితే ఒక...
- Advertisement -
- Advertisement -