Balayya: కజరారే…కజరారే…అంటూ కళ్ళు చెదిరే పర్ఫార్మెన్స్ ఇచిన్న బాలయ్య!

Balayya: తన కూతురు అల్లుడు తో కలిసి బాలయ్య స్టేజ్ మీద స్టెప్ లు వేస్తూ రెచ్చిపొయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో నందమూరి అభిమానులకు కనుల పండుగగా ఉంది. ఈ వయసులో కూడా బాలయ్య కిర్రాక్ పర్ఫార్మెన్స్ చూసి అభిమానులు ఆనందంతో ఉర్రూతలూగుతున్నారు.

ఈ వీడియోలో మొదట బ్రాహ్మణి లోకేష్ కలిసి సమర సింహా రెడ్డి లోని అందాల ఆట బొమ్మ సాంగ్ కి పర్ఫార్మ్ చేశారు. ఈ వీడియో బహుశా వాళ్ళ పెళ్లి మెహందీ ఫంక్షన్ కో, లేక రిసెప్షన్ కు తీసి ఉండొచ్చు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇందులో బ్రాహ్మణి లోకేష్ ఇద్దరు చాలా యంగ్ గా ఉన్నారు.

ఇద్దరు డ్యూయెట్ సాంగ్ లు పూర్తయిన వెంటనే కజరారే అంటూ బాలకృష్ణ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. బాలీవుడ్ లో బాగా క్రైస్ట్ తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్ కజరారే సాంగ్ కు బ్రాహ్మణి లోకేష్ బాలయ్యలతో కలిసి డాన్స్ వేసింది. ఈ వయసులో కూడా ఏమాత్రం జోష్ తగ్గకుండా నటసింహం డాన్స్ ను ఇరగదీసింది.

సాంగ్లకు తగ్గట్టుగా డాన్స్ వేస్తున్న బాలయ్య స్పీడుని ఇటు బ్రాహ్మణి అటు లోకేష్ కూడా మ్యాచ్ చేయలేక పోయారు. బాలయ్య తనదైన శైలిలో నవ్వుతూ నవ్విస్తూ ఆహ్లాదంగా డాన్స్ చేశారు. డాన్స్ మధ్యలో లొకేషన్ పక్కన నేట్టి బ్రాహ్మణి తో బాలయ్య చేపలు వేయడం….మళ్లీ తిరిగి లోకేష్ బాలయ్యను పక్కకు లాగడం.. ఇలా డాన్స్ మొత్తం సరదాగా సాగింది. ఎప్పటిదో పాత వీడియో ఇప్పుడు తిరిగి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ చాలా రోజుల తర్వాత తన కుటుంబంతో సరదాగా డాన్స్ వేస్తున్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ ఆనందించారు. బాలయ్య పర్ఫామెన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ పొగడ్తలతో ఆ వీడియోని బాగా వైరల్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -