Balayya: బాలయ్య నరుకుడు అభిమానులకు నచ్చడం లేదా?

Balayya: తెలుగు తెర మీద తనదైన స్టైల్ లో అందరినీ అలరిస్తున్న నటుడు నందమూరి బాలయ్య.. సంక్రాంతికి ‘వీరసింహారెడ్డి’గా బాక్సాఫీస్ మీద దండయాత్ర ప్రకటించాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళుతుండగా.. బాలయ్య అభిమానులు థియేటర్లలో సందడి మామూలుగా చేయడం లేదు. మరోసారి బాలయ్య ఫ్యాక్షన్ కథతో హిట్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది.

 

నందమూరి బాలయ్య ఎన్ని సంవత్సరాలు పాత చింతకాయ పచ్చడి లాంటి ఫ్యాక్షన్ స్టోరీలే చేస్తారని ఓ సెక్షన్ ఆడియన్స్ ప్రశ్నించే పరిస్థితి ఏర్పడింది. అదే రాయలసీమ, అదే ఫ్యాక్షన్ రివేంజ్ కథ, అవే పంచలు, అవే కార్లు, అవే బాంబులు, అవే కత్తులు.. అదే నరుకుడు.. ఇది ఇంకా ఎంత కాలం సాగుతుందనే చర్చ మొదలైంది. బాలయ్యను ఇలానే చూడాలనే ఓ ముద్రవేసి అతడిలోని నటుడిని తొక్కేశారు అని కొందరి అంటున్నారు.

 

తెలుగు తెర మీద ఫ్యాక్షన్ సినిమాలు చేయాలంటే అది ఖచ్చితంగా బాలయ్యకే సాధ్యం అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఫ్యాక్షనిజానికి పొలిటికల్ టచ్ ఇచ్చి సినిమాను ఎలా కమర్షియల్ హిట్ చేయవచ్చనే విషయాన్ని బాలయ్య ‘వీరసింహారెడ్డి’ని చూస్తే అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాయలసీమలో ఒకప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు లేకపోయినా కేవలం సినిమాల కోసమే ఫ్యాక్షన్ బూతాన్ని వాడుకుంటున్నారనేది చాలామంది అభిప్రాయం.

 

ఇక బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, నాలుగు డైలాగులు తప్పితే పెద్దగా సినిమాలో ఏమీ లేదని కూడా కొంతమంది కామెంట్. సినిమా అంటే పూర్తిస్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉండాలని అంతేకానీ నరకడం, రక్తపాతం మాత్రమే కాదని.. బాలయ్యకు మంచి స్కోప్ ఉండి, కథాపరంగా బలంగా ఉన్న సినిమా ఇస్తే ఇరగదీస్తాడని కానీ సక్సెస్ కోసం ఫ్యాక్షనిజం సినిమాలనే ఇస్తున్నారని నెటిజన్ల కామెంట్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -