Balayya NTR: బాబాయ్ మూవీకి అబ్బాయి వాయిస్ ఓవర్.. దబిడి దిబిడే!

Balayya NTR: నందమూరి నటసింహం బాలయ్యకు మాస్ ఫాలొయింగ్ కాస్త ఎక్కువే. ఆయన తోటి నటులు నటించిన సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయి హిట్ కొట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. కానీ బాలయ్య ‘ఏజ్ జస్ట్ ఏ నంబర్’ అంటూ పలు సినిమాలు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. ‘అఖండ’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాత భారీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వీరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. క్రాక్ మూవీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.

 

సినిమాకు సంబంధించిన గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో వినికిడి. దాదాపు 15 నిమిషాల పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఉంటుందట. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్తే నిజమైతే ‘వీరసింహారెడ్డి’ సినిమాకు చాలా అడ్వాంటేజేస్ ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ-ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమాలే లేవు. ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయికి తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. బాలయ్య సినిమాలో ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే నందమూరి ఫ్యాన్స్ కి పెద్ద పండగే. ఇద్దరి కాంబినేషన్‌లో మంచి రిజల్ట్ రావొచ్చని అభిమానులు భావిస్తున్నారు. కాగా, గతంలో ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్టుగా వచ్చాడు. ఆ సినిమా బిగ్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే సినిమాకు ప్లస్ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -