Balayya-Varalakshmi: బాలయ్య వరలక్ష్మి కాంబోలో అలాంటి మూవీ రాబోతుందా?

Balayya-Varalakshmi: నందమూరి బాలయ్య మంచి ఊపు మీద ఉన్నట్లు తెలుస్తోంది. వరుసగా తను చేస్తున్న సినిమాలు హిట్ అవడంతో పాటు బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’ షో రికార్డులు క్రియేట్ చేస్తుండటం తెలిసిందే. ‘అఖండ’ సినిమాతో కరోనా తర్వాత భారీ హిట్ అందుకున్న టాలీవుడ్ హీరోగా బాలయ్య రికార్డులకెక్కితే.. తాజాగా ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతికి తన జోరును చూపిస్తున్నాడు.

 

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. పక్కనున్న కర్ణాటకలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాలయ్య కలిగి ఉన్నాడు. ఇక ఓవర్సీస్ లో కూడా బాలయ్య హంగామా అంతాఇంతా కాదు. ఆస్ట్రేలియాలోని ఓ థియేటర్లో ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్రదర్శిస్తుండగా.. ఫ్యాన్స్ చేసిన హంగామాతో ఏకంగా షోని నిలిపివేసి.. థియేటర్ యజమాని పోలీసులతో అందరినీ బయటకు పంపించేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ను కలిగి ఉన్న నందమూరి బాలయ్య తాజాగా ‘వీరసింహారెడ్డి’తో మరో హిట్ ని సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాలో బాలయ్య చెల్లిగా నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ అందరినీ మెప్పించింది. అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్న వరలక్ష్మితో ఓ సినిమా చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించాడు.

 

తాను హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’షోలో ఈ విషాయాన్ని బాలయ్యే స్వయంగా వెల్లడించాడు. అయితే ఈ సినిమాలో బాలయ్య హీరో కాగా.. వరలక్ష్మి హీరోయిన్ గా నటిస్తోందట. దీంతో వరలక్ష్మితో బాలయ్య త్వరలోనే రొమాన్స్ చేయబోతున్నాడని, అతడు మామూలోడు కాదు బాబోయ్ అంటూ కొంతమంది నెటిజన్లు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -