Balayya: చంద్రబాబుకు మాటిచ్చిన బాలయ్య.. నేనే గెలిపిస్తానంటూ?

Balayya: ఉమ్మడి ఏపీలో సీనియర్ పొలిటికల్ లీడర్స్ లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు. ఒకానొక సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించారు. వాజ్ పాయ్ గవర్నమెంట్ లో చంద్రబాబు తన చాణిక్యాన్ని ప్రదర్శించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో ఓడిపోయిన చంద్రబాబుకు గడ్డు పరిస్థితులు దాపరించాయి. అయితే చంద్రబాబుకు బాలయ్య పెద్ద హామీ ఇచ్చారనే ప్రచారం సాగుతోంది.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అయినప్పటికీ యాంగ్ లీడర్ ప్రస్తుత సీఎం జగన్ ఎత్తులకు చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. కార్యకర్తలను కాపాడుకోలేకపోతున్నారు. వచ్చే ఎలక్షన్ టీడీపీకి చావోరేవో అన్నట్లుగా ఉన్నాయి. ఈ సందర్భంలోనే చంద్రబాబు పవన్ తోనూ పొత్తుకోసం మంతాలు సాగిస్తున్నాయి.

 

ఇటు నారా, నందమూరి కుటుంబాలు కూడా అన్యోన్యంగా ఉంటున్నాయి. కొన్ని ఘటనలు ఆ రెండు కుటుంబాలను మరింతగా దగ్గర చేశాయి. ఈ సందర్భంలోనే బాలయ్య, చంద్రబాబుకు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న చంద్రబాబు కళ్లలో సంతోషం చూడాలని బాలయ్య భావిస్తున్నారట. ఇందుకోసం పెద్ద ప్లాన్ వేసినట్లు తెలిసింది.

 

2024 ఎన్నికలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తాను ప్రచారం చేస్తానని బాలయ్య మాట ఇచ్చారని తెలిసింది. టీడీపీని గెలిపించే బాధ్యత తనదే అని చంద్రబాబుకు బాలయ్య మాటిచ్చారని సమాచారం. చంద్రబాబును సీఎంగానే కాదు పీఎంగా కూడా చూడాలని అనుకుంటున్నానని అలా చేసే బాధ్యత నాది అంటూ ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -