Balayya’s Re-release: బాలయ్య రీ రిలీజ్ సినిమా డిజాస్టర్ కావడం గ్యారంటీ.. ఇలాంటి తప్పులు చేస్తే ఎలా అంటూ?

Balayya’s Re-release: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమా హడావిడి కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు అందరూ కలిసి నటించిన సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న క్రమంలోనే బాలకృష్ణ హీరోగా నటించిన భైరవద్వీపం సినిమా తిరిగి విడుదలకు సిద్ధమవుతుంది.

మరొక రోజులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్నాయి. అయితే ఈ సినిమా మరొక రోజులో విడుదల కానున్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఏమాత్రం ఈ సినిమాని ప్రమోట్ చేయలేదు. ఈ సినిమాలో నటించిన నటీనటులందరూ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు .

 

ఇలా ఈ సినిమాలో నటించిన నటినట్టులు ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఎవరు కూడా ఈ సినిమా గురించి ఏ మాత్రం ఆలోచన చేయలేదు.బాలకృష్ణ సినీ కెరియర్ లో ఎంతో అద్భుతమైన సినిమాగా పేరు సంపాదించుకున్నటువంటి ఈ సినిమా తిరిగి 4కె వర్షన్ లో విడుదల కాబోతుంది. ఇలా ఈ సినిమా తిరిగి విడుదలవుతూ డిజాస్టర్ సొంతం చేసుకుంటుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

ఇలా సినిమా విడుదలకు ముందు ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించలేదు అలాగే సెలబ్రిటీలు ఎవరు కూడా ఇంటర్వ్యూలో పాల్గొనలేదు అలాగే థియేటర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది ఇలాంటి హడావుడి తరుణంలో ఈ సినిమాని తిరిగి విడుదల చేస్తే ఈ సినిమా కలెక్షన్ రాబట్టలేదని భావిస్తున్నారు. అయితే ఇదివరకు బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా కూడా ఇలాగే హడావిడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏమాత్రం ఆదరణ పొందలేకపోయింది. ఇప్పుడు భైరవద్వీపం సినిమా పరిస్థితి కూడా అలాగే ఉందని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -