Balineni: బాలినేని సంచలన వ్యాఖ్యలు.. పవన్ కు ఆస్తులిస్తానంటూ?

Balineni: ప్రస్తుతం సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థపై ఐటి అధికారులు దాడులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే జనసేన కార్పొరేట్ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించే సినిమాలకు వైసిపి మాజీమంత్రి ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా పెట్టుబడులు పెట్టారంటూ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు.

జనసేన కార్పొరేటర్ తనపై ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో తాను సరాసరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సవాల్ విసురుతున్నానని తెలిపారు.నేను కనుక మైత్రిలో పెట్టుబడులు పెట్టానని పవన్ కళ్యాణ్ కనుక నిరూపిస్తే తన ఆస్తి మొత్తం పవన్ కళ్యాణ్ కు రాసిస్తాను అంటూ సవాల్ చేశారు.ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు పవన్ కళ్యాణ్ కు చాలా బాగా పరిచయం ఉంటుంది వారిని అడిగే తన గురించి తెలుసుకోవచ్చని తెలిపారు.

 

నేను కానీ మా వియ్యంకుడు కానీ మైత్రి వారికి పెట్టుబడులు పెట్టినట్లు నిరూపిస్తే తాను తన ఆస్తిని మొత్తం పవన్ కళ్యాణ్ కు రాసి ఇవ్వడమే కాకుండా శాశ్వతంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని చాలెంజ్ చేశారు. ఇక మైత్రి వారిలో తాను భాగం అయ్యానని అందుకే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాకు సపోర్ట్ చేసినట్టు మాట్లాడారు. అయితే తాను బాలకృష్ణ సినిమాకు మాత్రమే కాదని వినోదం పంచే సినిమాలకు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.

 

ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు నన్ను సంప్రదించి ఒంగోలులో పర్మిషన్ ఇవ్వమని అస్సలు అడగలేదు. ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన సొంత జిల్లా అబ్బాయి కనుక తాను వచ్చి అడగడంతోనే ఈ సినిమాకు పర్మిషన్ ఇచ్చామని ఈ సందర్భంగా బాలినేని వెల్లడించారు.ఇక ప్రస్తుతం ఐటీ అధికారులు మైత్రి ఆఫీసుల పై దాడి చేస్తున్న నేపథ్యంలో సదరు జనసేన నేతలు ఈ విధంగా ఆరోపణలు చేసి, అధికారులను తనపై ఉసిగొలుపుతున్నారంటూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -