Bandla Ganesh: రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఆయనే అని జోస్యం చెప్పేసిన బండ్ల గణేష్?

Bandla Ganesh: బండ్ల గణేష్ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత. ఇతను నిర్మాత కాకముందు సుస్వాగతం, సూర్యవంశం, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలలో సహాయ పాత్రలలో నటించాడు. నిర్మాతగా మారి ఆంజనేయులు, తీన్మార్, గబ్బర్ సింగ్, బాద్ షా, ఇద్దరమ్మాయిలతో చిత్రాలు నిర్మించాడు.

బండ్ల గణేష్ ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇంటర్వ్యూలో మీ ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ కదా, ఆయన వద్దకు మీరు ఎందుకు వెళ్లడం లేదు అనే ప్రశ్న ఎదురయింది. అందుకు బదులుగా తాను వెళ్తున్నానని, తాను వెళ్లడం లేదని మీరు ఎలా అనుకుంటారు అని బదులిచ్చాడు. తను అనుక్షణం పవన్ కళ్యాణ్ వెంటే ఉంటానని, ఆయననే ఫాలో అవుతున్నానని తెలిపాడు.

తన ఉద్దేశం ప్రకారం 2024లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని తెలపడం జరిగింది. తనకు పబ్లిసిటీ అంటే ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ ప్రతి బర్త్ డే ని తన ఇంట్లో పండగలగా చేసుకుంటామని తెలిపాడు. పవన్ కళ్యాణ్ తనకు ఎంతో సపోర్ట్ చేశారని, ఆయనపై అపారమైన గౌరవం, భక్తి ఉన్నాయని తెలిపాడు. తనకు తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్న రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకోవాలనేదే తన కోరిక అని పేర్కొనడం జరిగింది.

తరువాత డేగల బాబ్జి సినిమా సక్సెస్ అయ్యి, కమర్షియల్ పరంగా వసూలు బాగా రాబట్టాలని తెలుపుతూ, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఎదుర్కొనే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో అని చూపించేదే ఈ సినిమా కథ. ఈ సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయింది. డైరెక్టర్ చక్కగా ఈ సినిమాను చూపించాడు. మంచిగా మార్పులు చేర్పులు చేసి ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది అని పేర్కొనడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -