Bandla Ganesh: పవన్ కళ్యాణ్‌ను తక్కువ చేసిన అంబటి.. రంగంలోకి బండ్ల గణేష్

Bandla Ganesh: బండ్ల గణేష్ మెగా అభిమాని. పవన్ కళ్యాణ్ భక్తుడు. పవర్ స్టార్ అభిమానుల చెవుల్లో ఇప్పటికీ ఎప్పటికీ బండ్ల గణేష్ స్పీచులు మార్మోగిపోతూనే ఉంటాయి. ఈశ్వరా పరమేశ్వరా.. పవనేశ్వరా అనే ఆ సుధీర్ఘ ప్రసంగానికి అందరూ ఫిదా అయ్యారు. అలా బండ్ల గణేష్ ఎప్పుడూ కూడా పవన్ నామస్మరణ చేస్తుంటాడు. పవన్ కళ్యాణ్ మీద ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ నోరు పారేసుకుంటే వెంటనే బండ్ల గణేష్ రంగంలోకి దిగుతాడు.

ట్విట్టర్‌లో బండ్ల గణేష్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గురించి నిత్యం పోస్టులు పెడుతూనే ఉంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ మీద సెటైర్ వేసిన వైసీపీ నాయకుడి పరువుతీసేశాడు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్ల గణేష్ వేసిన ఆ ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి 175 సీట్లకి పోటీ చేస్తున్నారా! లేదా? ఇండిపెండెన్స్ డే రోజునైనా ప్రకటించండి! అని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ట్వీట్ వేశాడు. దీంతో బండ్లన్నకు ఎక్కడో కాలినట్టుంది.. వెంటనే అదిరిపోయే కౌంటర్ వేశాడు. అంబటి రాంబాబు ఆడియో అప్పట్లో ఎంతటి కలకలం రేపిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అది గుర్తుకు వచ్చేలా అంబటి మీద బండ్లన్న సెటైర్లు వేశాడు.

అలాగే రంభల రాంబాబు గారు మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు అంటూ బండ్ల గణేష్ కౌంటర్లు వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బండ్లన్న అదిరిపోయే కౌంటర్ వేశావ్ అన్నా అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ ట్వీట్‌ను రీట్వీట్ కొడుతున్నారు.లైకులతో దుమ్ములేపుతున్నారు. మొత్తానాకి బండ్ల గణేష్ మాత్రం ఇలా రియాక్ట్ అవ్వడంతో ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -