Banks: లావాదేవీలు జరుపుకునే వారు ఇప్పుడు చేసుకోండి.. డిసెంబర్‌లో 13 రోజులు బ్యాంకులన్నీ బంద్‌!

Banks: ప్రతి ఒక్కరూ దాదాపుగా బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతుంటారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, దినసరి కూలీలు సైతం తమ సంపాదనను బ్యాంకుల్లో దాచుకుంటారు. బ్యాంకులకు సెలవులు వస్తున్నాయంటే ముందస్తుగా జాగ్రత్తలు పడి లావాదేవీలు జరుపుతుంటారు. అయితే నవంబర్‌ నెలలో ఎక్కువ సెలవులు ఉండటంతో వినియోగదారులు అలర్ట్‌ అవ్వాలని ఆయా బ్యాంకుల అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకులకు కచ్చితంగా వెళ్లాల్సిన వినియోగదారులు మందుస్తుగా బ్యాంకులకు ఉండే సెలవులను గ్రహించుకుని లావాదేవీలు జరుపుకోవాలని సూచిస్తున్నారు.

 

వచ్చే నెలలో బ్యాంకులకు ఎక్కువ రోజులు సెలువులు ఉన్నాయి. దాదాపుగా నెలలో 13 రోజులు బ్యాంకులు తెరుచుకోవు. కాబట్టి ఆ నెలలో ఎలాంటి లావాదేవీలు, చెక్‌ల డ్రాలు, డిపాజిట్లను ముందస్తుగా జరుపుకోవాలని బ్యాంకుల అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకులు నేరుగా పని చేయవు ఆన్‌లైన్‌లో మాత్రం అన్ని లావాదేవీలు జరుగుతాయి. అయితే ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉండవని ఆయా రాష్ట్రాల పండగలు, ప్రత్యేక దినాలు బట్టి సెలవులు ఉంటాయట. జాతీయస్థాయిలో మాత్రం(03,04,10,11, 18,24,25) తేదీల్లో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు.

 

డిసెంబర్‌–3 శనివారం, సెయింట్‌ జేవీయర్స్‌ ఫీస్ట్, గోవాలో బ్యాంకు మూసివేయబడుతుంది.
4న ఆదివారం, 10వ తేదీ రెండో శనివారం దేశంలోని అన్ని బ్యాంకులు సెలవు ఉంటుంది.
డిసెంబర్‌ 11 ఆదివారం 12న పాటాగన్‌ నెంగ్మింజ సంగం మేఘాలయలో బ్యాంక్‌ బంద్‌. 8న ఆదివారం, 19వ తేదీ గోవా విమోచన దినం సందర్భంగా అక్కడ బ్యాంకులు మూసివేయబడతాయి. ∙డిసెంబర్‌ 24 కిస్మస్‌తో పాటు నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల మూసివేయబడుతాయి. 25న ఆదివారం, 26న కిస్మస్, లాసంగ్, నమ్సంగ్‌ మిజోరం, సిక్కిం, మేఘాలయలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ∙29వ తేదీ గురు గోవింద్‌ సింగ్‌ బర్త్‌డే సందర్భంగా 30న యు కియాంగ్‌ సంగ్వా మేఘాలయలో బ్యాంక్‌ మూసి ఉంటుంది. డిసెంబర్‌ 31 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మిజోరంలో అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -