ATM: చిరిగిన నోట్లు ఏటీఎం నుంచి వస్తే ఏం చేయాలో తెలుసా?

ATM: అప్పుడప్పుడు ఏటీఎంలో నుంచి కూడా చిరిగిన నోట్లు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు చాలా మంది ఏం చేయాలో అర్థం కాక ఇబ్బందులకు గురవుతుంటారు. అదే బ్యాంకు అయితే వెంటనే ఆ అధికారికి చూపించి వేరు నోట్లను తీసుకుంటారు. కానీ.. ఏటీఎంలో వచ్చే చిరిగిన నోట్లపై టెన్షన్‌కు గురవుతారు. ఒక్కోసారి నకిలీవి కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వాటినే సులువుగా మార్చుకునే అవకాశం ఉందంటుంది సెంట్రల్‌ బ్యాంకు. ఏటీఎంలలో చిరిగిపోయినా, నకిలీ నోట్లు వస్తే వాటిని బ్యాంక్‌లలో డిపాజిట్‌ చేసుకుని కొత్త నోట్లను తీసుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
అలాంటి నోట్లను మార్చడంలో బ్యాంకులు అభ్యంతరం తెలిపితే బ్యాంకులపై ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని గుర్తించుకోవాలి. అలాంటి బ్యాంకుకు 10 వేల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. బ్యాంకు ఏటీఎం నుంచి చిరిగిన, చిరిగిన నోట్లు వస్తున్నాయంటే ఆ బాధ్యత బ్యాంకుపైనే ఉంటుంది. అలాంటి నోట్లను మార్చుకునే బాధ్యత బ్యాంకుదే. అందుకే ఏటీఎంలోనే నోట్లను డిపాజిట్ చేసేటప్పుడు వాటిని సరిచూసుకోవడం బ్యాంకు పని.

అయితే ఏటీఎంల నుంచి చిరిగిన కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలను రూపొందించింది. ఈ నియమం ప్రకారం.. చిరిగిన నోట్లు బ్యాంకు ఏటీఎం నుండి వచ్చినట్లయితే ఈ నోట్లను మార్చుకోవడానికి బ్యాంకు నిరాకరించదు. నోట్ల మార్పిడి ప్రక్రియ చాలా సులభం. జూలై 2016లో ఆర్‌బీఐ అటువంటి నోట్లను మార్చడానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. బ్యాంకు నోట్లను మార్చుకోవడానికి నిరాకరిస్తే ఆ బ్యాంకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆర్బీఐ హెచ్చరిస్తోంది.

నోటు సీరియల్ నంబర్, మహాత్మా గాంధీ వాటర్‌మార్క్, గవర్నర్ సంతకం  కనిపించకపోతే అది నకిలీ నోటు అని గుర్తించి నోటును మార్చుకోవాలి. ఒకరు 20 నోట్లను మార్చుకోవచ్చు. వాటి విలువ రూ.5000 మించకూడదు. నోట్లు మార్చుకోవడానికి సదరు వ్యక్తి ఒక దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తేదీ, సమయంతో పాటు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసిన మొత్తం వివరాలు నమోదు చేస్తే మీకొచ్చిన   చిరిగిన నోట్లను మార్చుకోవచ్చు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -