Bellamkonda Suresh: కొడుకు గురించి అలాంటి కామెంట్లు చేసిన బెల్లంకొండ సురేష్.. ఇంతకు ఏమన్నాడంటే?

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్ తెలుగు చలనచిత్ర నిర్మాత. ఈయన తెలుగు ఇండస్ట్రీలో మంచి మంచి సినిమాలను నిర్మించడం జరిగింది. ఈయనకు ఇద్దరు కుమారులు సాయి శ్రీనివాస్, గణేష్ బాబు సంతానం. సాయి శ్రీనివాస్ హీరోగా అందరికీ సుపరిచితమే. ఈయన నిర్మించిన సినిమాలలో చెన్నకేశవరెడ్డి, ఆది, అల్లుడు శీను, కాంచన 2 చిత్రాలు చెప్పుకోదగినవి.

బెల్లంకొండ సురేష్ గతంలో ఓ సినిమా ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తున్నాయి. తన కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ ఏకంగా ఐదు సినిమాలు ఓకే చేసి బిజీగా ఉన్నాడంటూ, తెలుగు ఇండస్ట్రీలో హీరోలు కరువయ్యారు అని తెలిపాడు.

తన కొడుకు డేట్స్ తనకే దొరకనంత బిజీగా రాణిస్తున్నాడని తెలపడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తన పక్కన ఉన్న వివి వినాయక్ ను అవకాశం వస్తే హీరోగా ఒక సినిమా నిర్మిస్తానని తెలుపుతూ, వివి వినాయక్ డైరెక్షన్ తనకు ఎంతో నచ్చుతుందని అతనితో కలిసి రెండు మూడు సినిమాలు నిర్మించడం చాలా సంతోషంగా ఉందని తెలపడం జరిగింది.

వివి వినాయక్ లో మంచి టాలెంట్ ఉంది. ఆయన హీరోగా చేస్తే ఆ సినిమా కచ్చితంగా ఒక బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది. కచ్చితంగా త్వరలో వివి వినాయకుని హీరోగా పెట్టి ఒక సినిమా నిర్మించాలి అని అనుకుంటున్నట్లు పేర్కొనడం జరిగింది. ఇక తన కుమారుని గురించి చెబుతూ మొదటి సినిమా అల్లుడు శీను తోనే మంచి విజయం సాధించి, తర్వాత తనకి దొరకనంత బిజీగా ఉన్నాడని తెలిపాడు.

తాను నిర్మించే సినిమాలు కథకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తానని, అది కమర్షియల్ సక్సెస్ అవుతుందా కాదా అనేది పక్కన పెట్టి ప్రేక్షకుల ఆనందం కోసం తాను సినిమాలను నిర్మించడం జరుగుతుంది అని తెలిపాడు. తాను నిర్మించిన ఒక సినిమా గురించి ఒక ఎంపీ గారు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఎంతో ఆనందించినట్లు తెలపడం జరిగింది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -