పూరి జగన్నాథ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన వివి వినాయక్!

వివి వినాయక్ భారతీయ చలనచిత్ర దర్శకుడిగా అందరికీ సుపరిచితమే. తెలుగు చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందిన స్క్రీన్ రైటర్. వినాయక్ 2002లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాకు దర్శకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

ఆది సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. వినాయక దర్శకత్వం వహించిన విజయవంతమైన చిత్రాలలో బన్నీ, లక్ష్మి, కృష్ణ, అదుర్స్, ఠాగూర్, నాయక్, ఖైదీ నెంబర్ 150 లుగా చెప్పుకోవచ్చు.

వినాయక్ అవయవ దానాన్ని ప్రోత్సహించడానికి ఒక లఘు చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇటీవలే కాలంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ సినిమా గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అందుకు సమాధానంగా వినాయక్ ఏదో ఒక సినిమా సక్సెస్ కాలేదని బాధపడే మనస్తత్వం పూరి జగన్నాథ్ కు లేదని పేర్కొనడం జరిగింది.

పూరి చేసిన పోకిరి సినిమా గురించి ఇప్పటికీ మర్చిపోలేము. పూరి మనస్తత్వం ఎలాంటిదంటే ఇప్పుడు వచ్చిన నష్టాన్ని రాబోయే సినిమాతో ఎలా భర్తీ చేయాలి. అందుకు ఏ విధమైన కథతో సినిమా చేయాలి అని ఆలోచిస్తాడే తప్ప ప్రస్తుతం తాను తీసిన సినిమా సక్సెస్ కాలేదని కుంగిపోయేంత పిరికితనం అతనిలో లేదని పేర్కొనడం జరిగింది.

సినీ రంగంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకసారి సక్సెస్ వస్తుంది మరొకసారి రాదు. తామంతా ఇలాంటివన్నీ ముందుగానే ఊహించి సినిమాలు తీస్తాం అని తెలిపాడు. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనేది మనం చెప్పలేం కదా, పూరికి చాలా ధైర్యం ఉంది. ఇలాంటి వాటిని సీరియస్ గా తీసుకొని కుంగిపోడు అని చెప్పడం జరిగింది.

తరువాత బైకాట్ చేయడం అనేది తెలుగు ఇండస్ట్రీలో కూడా వినిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంది అని ప్రశ్నించినప్పుడు అందుకు వినాయక్ ఇది ఒక సరదా అయిపోయింది. అంతకుమించి ఏమీ లేదు. సినిమాకు డబ్బులు పెట్టే వారికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో మిగతా వారికి తెలియదు కదా అనడం జరిగింది. ప్రస్తుతం వినాయక్ ఒక సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -