Samba: సాంబ మూవీ ఫ్లాప్ కావడానికి ఆ ఒక్క సీన్ కారణమా?

Samba: టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలయ్యింది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే గతంలో జూనియర్ ఎన్టీఆర్,వీవీ వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో సాంబ.

ఇందులో భూమిక, జెనీలియా హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేక పోయింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ఒక సన్నివేశంలో వినాయక్ వదిన మరిది మధ్య బంధాన్ని అసభ్యంగా చూపించారు. కాగా కథ ప్రకారం ఆ సన్నివేశం బాగానే ఉన్నా చాలామంది ప్రేక్షకులు ఆ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇకపోతే ఈ ఒక్క తప్పు సాంబ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైంది.

 

అయితే ఇదే విషయాన్ని వివి వినాయక్ తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్వ్యూలో భాగంగా వివి వినాయక మాట్లాడుతూ సినిమాలో వదిన మరిది మధ్య బంధాన్ని అసభ్యంగా చూపించిన విషయం ప్రేక్షకులకు నచ్చలేదు అది చాలా మైనస్ గా మారింది అని చెప్పుకొచ్చారు వివి వినాయక్. ఒకవేళ ఈ సినిమాలో అసలు విషయం కనుక లేకపోయి ఉంటే సినిమా హిట్ అయి ఉండేదేమో అంటూ చాలామంది అప్పట్లో అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -