Chatrapathi: హిందీకి ఛత్రపతికి విచిత్రమైన సమస్య.. ఎవరు కొనట్లేదుగా!

Chatrapathi: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి మనందరికీ తెలిసిందే. తెలుగులో నటించిన తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఇది ఇలా ఉంటే సాయి శ్రీనివాస్ తాజాగా నటించిన చిత్రం చత్రపతి. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఈ సినిమా విషయంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదివరకు సాయి శ్రీనివాస్ తెలుగులో నటించిన ఒక సినిమా హిందీలో డబ్బింగ్ అయ్యే కోట్ల వ్యూస్ ని రాబట్టడంతో ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆ కోట్ల వ్యూస్ ని చూసే సాయి శ్రీనివాస్ తన సినిమా విషయంలో కాస్త పొగరుగా బలుపుగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చాలామందీ చత్రపతి సినిమాను రీమేక్ చేయాలని రీమేక్ తో హిందీలో అడుగు పెట్టాలనుకోవడమే తప్పు అని అంటున్నారు. అసలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి నటనలో బేసిక్స్ కూడా తెలియవు పెద్దగా సినిమాలలో కూడా నటించలేదు అలాంటిది ఏకంగా ప్రభాస్ సినిమాని రీమిక్ చేయాలనుకోవడం పెద్ద టాస్కే అని అంటున్నారు.

aఇదివరకే చత్రపతి సినిమాను చూశారు. అందులో ప్రభాస్ క్యారెక్టర్ అని కూడా చూశారు. ఇప్పుడు మళ్లీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అదే సినిమాను రీమేక్ చేస్తే చూస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలె ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఆ ట్రైలర్ కు కూడా పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే ఈ సినిమా పరిస్థితిని గమనిస్తున్న బయర్లు చత్రపతి సినిమా వైపు కనీసం తొంగి చూడడం కూడా లేదు. చివరికి చేసేదేమీ లేక పెన్ స్టూడియోస్ వల్లే సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేసుకోవాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు 100 కోట్ల వరకు ఖర్చు అయ్యిందట. దీంతో అసలు కనీసం పెట్టుబడి కూడా వస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సినిమాను ఎవరూ కొనడానికి కూడా ముందుకు రావడం లేదు. అసలు ఈ సినిమాలో ఏం చూసి 100 కోట్లు ఖర్చు పెట్టారని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -