Chatrapathi: ఛత్రపతి హిందీ టీజర్ కు అలాంటి రెస్పాన్స్.. స్టార్స్ ను మించి?

Chatrapathi: ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఆ తర్వాత జయ జానకి నాయక, సాక్ష్యం, రాక్షసుడు వంటి మరికొన్ని సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు పొందాడు. బెల్లంకొండ శ్రీనివాస్ కి తెలుగులో సరైన హిట్ లేకపోయినా కూడా బాలీవుడ్ లో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది.

జయ జానకి నాయక సినిమా హింది లో మంచి హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ప్రభాస్ నటించిన చత్రపతి సినిమాని హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. పెన్ స్టూడియోస్ నిర్మాతలు ఈ సినిమా కోసం ఖర్చు విషయంలో ఏ మాత్రం రాజీ పడలేదు. హిందీలో సైతం ఈ సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

 

బెలంకొండ శ్రీనివాస్ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీ ప్రేక్షకులకు సుపరిచితం కాగా జయజానకి నాయక సినిమా హిందీ వెర్షన్ వ్యూస్ విషయంలో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించగా బాలీవుడ్ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ లాగే బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఛత్రపతి పాత్రకు న్యాయం చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మే 12 వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే బెల్లంకొండ శ్రీనివాస్, వీవీ వినాయక్ బాలీవుడ్ లో బిజీ కావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చత్రపతి సినిమా హిందీ వెర్షన్ లో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. హిందీలో సైతం ఈ సినిమా మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ అవుతున్నాయి. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్ లో బెల్లం కొండ శ్రీనివాస్ హవా నడుస్తుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా తెలుగులో సక్సెస్ సాధించలేనటువంటి ఈ హీరో హిందీలో అయినా సక్సెస్ అందుకుంటారా లేదా తెలియాల్సి ఉంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -