Samantha: సమంత సినిమాలు ఆపేస్తే బెటర్.. ఇంత ఘోరమేంటి సామీ!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పరవాలేదు అనిపించుకున్నప్పటికీ మరొక పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీ విడుదలైంది.

గుణశేఖర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో సమంతా నటించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు 70 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించిన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇలా ఈ సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం చేసిన హంగామా మామూలుగా లేదు. అయితే ఈ సినిమా విడుదలైన మొదటి రోజే చిత్ర బృందానికి కోలుకోలేని దెబ్బ కొట్టింది.

సమంత నటించిన శాకుంతలం సినిమాని ప్రేక్షకులు ఆదరించలేకపోయారు.ఈ సినిమా ప్రీమియర్ షో వేయడంతో నిర్మాతలు పెద్ద తప్పు చేశారని తెలుస్తుంది. ఇలా ప్రీమియర్ షో చూసినటువంటి బయ్యర్లు ఈ సినిమా మాకొద్దు అంటూ పెద్ద ఎత్తున నిర్మాతలకు షాక్ ఇచ్చారు. ఇక ఎటు తేల్చుకోలేని పక్షంలో అడ్వాన్సులపై ఈ సినిమాని విడుదల చేయగా కలెక్షన్లు కూడా పెద్దగా రాబట్ట లేక పోయింది. ఉత్తరాంధ్రలో మొదటి రోజు ఈ సినిమా కేవలం 14 లక్షల షేర్ రాబట్టింది. నైజాంలో 65 లక్షల వరకు షేర్స్ రాబట్టింది.

ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఇలా ఘోరమైన కలెక్షన్లను సాధించడంతో నిర్మాతలు తీవ్రస్థాయిలో నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పలువురు భావిస్తున్నారు. అలాగే సినిమాలో కంటెంట్ లేదని తెలిసినప్పుడు ఈ సినిమాకి ప్రీమియర్ షో వేయడం కూడా పెద్ద మైనస్ అని పలువురు భావిస్తున్నారు. ఈ సినిమాలో నటించి సమంత తనకు ఉన్నటువంటి క్రేజ్ తగ్గించుకున్నారని చెప్పాలి.ఈ సినిమా చూసిన పలువురు అభిమానులు ఇకపై సమంత నువ్వు సినిమాలు చేయకపోవడమే మంచిదేమో అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ లో అయినా శాకుంతలం కలెక్షన్లు పెరుగుతాయా.. కలెక్షన్లు నిర్మాతలకు ఊరట కలిగించేనా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -