Menarikam Marriage: మేనరికం పెళ్లిళ్లు చేసుకోవద్దంటా.. ఎందుకో తెలుసా?

Menarikam Marriage: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటుంటారు. ఎవరికీ ఎక్కడ రాసి ఉందో వారే తమ జీవితంలోకి వస్తారు. గుర్తు తెలియని వ్యక్తి లేదా బంధువుల్లో ఒకరు మన లైఫ్‌లోకి వస్తుంటారు. అయితే ప్రస్తుతం కాలంలో అమ్మాయిల తల్లిదండ్రులు సేఫ్టీ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. తెలియని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయడం కంటే.. తెలిసిన వాడితోనే వివాహం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో బంధువులనే పెళ్లిళ్లు చేసుకుంటారు. ముఖ్యంగా మేనరికం వివాహాలు చేయడానికి చాలా మంది సుముకత చూపుతారు. అది మనకు మొదటి నుంచి వస్తున్నసంప్రదాయం. మరదలు, మేనకోడలిని పెళ్లి చేసుకుంటారు. అయితే ఈ పెళ్లి విషయంలో కొందరు సంతోషంగా ఉంటున్నా.. మరికొందరు బాధపడుతుంటారు.

మూడు జనరేషన్‌లు దాటిన తర్వాత మేనరికం వివాహాలు చేసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. అయితే అది ఎందుకు వద్దంటున్నారో ఒక్కసారి చూద్దామా. మేనరికం వివాహం చేసుకోవడం వల్ల భార్యభర్తలకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. కానీ పుట్టబోయే పిల్లలకు మాత్రం అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అంగవైకల్యం, వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయి. సైంటిఫిక్‌గా దీనికంటూ ప్రత్యేక కారణం ఉంది. పుట్టబోయే బిడ్డకు తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 క్రోయోజోములు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా వచ్చే క్రోమోజోములు తల్లిదండ్రుల నుంచి వారి పిల్లలకు కలుగుతాయి.

అయితే పెళ్లి చేసుకునే వారు రక్త సంబంధీకులు కాకుంటే బిడ్డకు తండ్రి నుంచి ఒక జన్యువు లోపభూయిష్టంగా ఉంటే.. తల్లి నుంచి మంచి జన్యువుతో ఆ లోపం భర్తీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తల్లిలో లోపభూయిష్టమైన జన్యువు ఉంటే, తండ్రి నుంచి వచ్చే జన్యువు వల్ల పుట్టబోయే బిడ్డలో ప్రభావం చూపి.. ఎలాంటి లోపం రాకుండా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇద్దరు దంపతులు ఒకే కుటుంబానికి చెందిన వారైతే.. ఇద్దరిలో జన్యులోపం ఉంటే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. వీరికి పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన లోపం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -