Wedding: ఇద్దరు విదేశీ యువకులు చీర కట్టుకుని పెళ్లి మండపానికి.. ఎందుకో తెలుసా?

Wedding: సాధారణంగా పెళ్లిల్లో కామెడిలు, ఫన్ని సన్నివేశాలు జరుగుతుంటాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫ్రెండ్‌ చేసే కొన్ని సరదా పనులు నవ్వులు పుట్టిస్తాయి. ఇటీవల వరుడు, వధువు ఉన్న స్టేజీపైకి వారివారి ఫ్రెండ్స్‌ ఇస్తున్న గిఫ్ట్స్, చేసే చిలిపి పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గతంలో ఓ పెళ్లి కొడుకు ఫ్రెండ్‌ బురఖా వేసుకుని వరుడికి గిఫ్ట్‌ ఇచ్చి కౌగిలించుకుంటారు. అది చూసిన పెళ్లి కూతురు ఒక్కసారిగా షాక్‌కు గురై వారి వైపు వింతగా చూస్తోంది. ఆ తర్వాత పెళ్లి కొడుకు ఆ బురఖా తీస్తే అతని క్లోస్‌ ఫ్రెండ్‌ ఉంటాడు. ఇది చూసిన పెళ్లి కూతురితో పాటు అందరు నవ్వుతారు. అప్పట్లో ఆ వీడియో తెగ వైరల్‌ అయింది. తాజాగా అమెరికాలో జరిగిన ఘటన మరింత వైరల్‌ అవుతోంది.

 

అమెరికాలో పెళ్లి చేసుకుంటున్న భారతీయ సంతతికి చెందిన స్నేహితుడికి సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి అతడి ఫ్రెండ్స్‌ చేసినా పనికి అందరు షాక్‌ అయ్యారు. ఇద్దరు వ్యక్తులు పట్టుచీరలు కట్టుకుని వయ్యారంగా పెళ్లి మండపానికి వచ్చిన వీడిలో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడిలో ఏముందంటే.. చికాగోలో భారతీయన సంతతికి చెందిన వ్యక్తి పెళ్లి జరుగుతుంటుంది. కొద్ది సేపటికి ఇద్దరు వ్యక్తులు చీరకట్టుకుని బొట్టుపెట్టుకుని చీర కుచ్చులు పట్టుకుని అచ్చం మహిళల లాగే స్టేజీపైకి వస్తారు.

 

ముందుగా వారిని చూసిన పెళ్లి కొడుకు షాక్‌ అవుతారు. షాక్‌నుంచి తేరుకుని వీరు నా ఫ్రెండ్స్‌ అని గుర్తుపట్టి ఒక్కసారిగా ఆనందంతో కౌగిలించుకుంటాడు. అది చూసిన ఒక్కడున్న వారంతా నవ్వులే నవ్వులు పూయిస్తారు. పెళ్లి కూతురు కూడా కాసేపటి వరకూ నవ్వుతూనే ఉంటుంది. ఆ తర్వాత వారంతా కలిసి గ్రూప్‌ ఫొటో తీసుకుంటారు. చికాగోకు చెందిన ఓ ఫొటో గ్రఫర్‌ ఈ సీన్‌ను ఇన్‌స్టాలో అప్‌లోడ్‌ చేయడంతో దేశమంతా వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను దాదాపుగా 30 వేల సార్లు చూశారు. ఇది చూసిన కొందరు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. క్లోస్‌ ఫ్రెండ్‌కు మంచి సర్‌ప్రెస్‌ ఇచ్చారని కొందరు.. నైస్‌ ఐడియా అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -