Wedding: పెళ్లి సమయంలో కేవలం మూడు ముళ్లు వేయడం వెనుక ఆంతర్యం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Wedding: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ చిన్న కార్యం జరిగిన కూడా దానిని సాంప్రదాయ బద్ధంగా చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలోనే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక ఇంట్లో పెళ్లి చేస్తే కనుక ఆ పెళ్లిలో ఎన్నో కార్యక్రమాలు సాంప్రదాయం ప్రకారమే జరుగుతూ ఉంటాయి. ఇలా పెళ్లిలో మూడు ముళ్ళు వేయడం కూడా ప్రాచీన కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారమని చెప్పాలి.

ఇలా పెళ్లిలో మాంగల్య ధారణ చేసేటప్పుడు మూడు ముళ్ళు ఎందుకు వేయాలి ఇలా వేయడం వెనుక ఉన్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే… ప్రాచీన కాలం నుంచి పెద్దవాళ్లు మూడు అనే పదానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. దేవుళ్ళకి సంబంధించి చూస్తే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు. అలానే సృష్టి పరంగా చూసినట్లయితే సృష్టి, స్థితి, లయలు మూడు.

 

ఆధ్యాత్మికపరంగా చూసుకున్నట్లయితే, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శాంతులు మూడు. ఇక తాంబూలం విషయానికి వస్తే ఆకు వక్క సున్నం ఇవి కూడా మూడే. బ్రహ్మ సూత్రంలోని ముడులు కూడా మూడు. ధర్మ, అర్ధ, కామ‌ము అనే మూడింటితో మోక్షాన్ని పొందొచ్చు.  మంగళసూత్రపు పేటలు మూడు. ముడులు కూడా మూడు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మూడు శరీరాలు ఉంటాయి.

 

స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. ఇలా మాంసం, రక్తం, ఎముకలు ఈ మూడింటినీ కూడా శరీరం కప్పుతుంది. ఇలా మనిషికి మూడు శరీరాలు ఉన్నాయి. కనుక మూడు శరీరాలకు కూడా మూడు ముడులు వేస్తారు.అందుకే ఈ మూడిటికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎంతో విలువ ఉంది కాబట్టి వివాహ సమయంలో కూడా వరుడు వధువు మెడలో మూడు ముళ్ళు వేసి మాంగల్య ధారణ చేస్తారు.

 

 

Related Articles

ట్రేండింగ్

Jagan Campaigners For TDP: టీడీపీకి జగన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్.. నమ్మకపోయినా వాస్తవం మాత్రం ఇదే!

Jagan Campaigners For TDP: వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా మారిపోయారు. ప్రజలు నమ్మిన నమ్మకపోయినా ఇదే వాస్తవమని తెలుస్తోంది చంద్రబాబు నాయుడు సూపర్...
- Advertisement -
- Advertisement -