Bhawani Peta: తల్లిని దారుణంగా చంపిన కొడుకు.. ఆపై అతను కూడా అలా?

Bhawani Peta: ఈ మధ్యకాలంలో చాలామంది కొడుకులు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది. కన్న తల్లిదండ్రులు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి వారి పట్ల క్రూరంగా దారుణంగా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను దగ్గర ఉండి చూసుకోవాల్సింది పోయి వృద్ధాశ్రమంలో పడేయడం రోడ్డుపై విడిచి వెళ్లడం లాంటివి చేస్తున్నారు. మరికొందరి ఇంట్లో తల్లిదండ్రులు మంచి మాటలు చెప్పినందుకు వారిపై దాడికి ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని వారిని చంపడానికి కూడా కనపడటం లేదు. తాజాగా కూడా ఒక కుమారుడు తన కన్నతల్లిని చిత్రహింసలకు గురి చేయడం మాత్రమే కాకుండా ఆమెను దారుణంగా చంపేశాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భవానిపేటకు చెందిన చిటుకుల నర్సవ్య అని 70 ఏళ్ల వృద్ధురాలు స్థానిక గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా పనిచేస్తోంది. ఆమె భర్త చాలా ఏళ్ల క్రితమే మరణించారు. అప్పటి నుంచి కష్టపడి వ్యవసాయ పనులు చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. ఆమె కుమారుడు నర్సారెడ్డి మద్యానికి బానిసగా మారి ఇంట్లో వారితో నిత్యం గొడవ పడుతుండే వాడు. నిత్యం తాగి వచ్చి భార్య, పిల్లలను ఇష్టమెచ్చినట్లు తిడుతూ, కొడుతూ ఉండేవాడు. నర్సారెడ్డి హింసలను భరించలేక భార్య, పిల్లలు అతడికి దూరంగా ఉంటున్నారు. భార్య, పిల్లలు దూరంగా ఉండటంతో నర్సారెడ్డి మరింత రాక్షసుడిగా మారిపోయాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ తాగి వచ్చి తల్లిని హింసించేవాడు.

 

ఇదే విషయంపై నర్సవ్వ పెద్ద మనుషుల మధ్య పంచాయితీ పెట్టగా అప్పటికి సర్దుకుపోయిన నర్సారెడ్డి తరువాత మళ్లీ తల్లిని హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోని తాజాగా మరొకసారి నర్సారెడ్డి తన తల్లితో గొడవకు దిగాడు. ఇక ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో కోపంతో ఊగిపోయిన నరసరెడ్డి కట్టెతో తన తల్లిని దారుణంగా కొట్టాడు. అనంతరం ఆమె పైనుంచి బైక్ ను ఎక్కించి చిత్రహింసలకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ దుర్మార్గుడు ఇనుపరాడును కాల్చి వాతలు కూడా పెట్టాడు. ఆ రాడ్డుతోనే నర్సవ్వను దారుణంగా కొట్టి చంపేశాడు. నర్సారెడ్డి ప్రవర్తనను చూసిన స్థానికులు ఎవరు అడ్డుకునే సాహసం చేయలేదు. ఇక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నరసవ్వను హాస్పిటల్ కి మార్గం మధ్యలోనే మృతి చెందింది. తల్లి మృతదేహం ఇంటికి వచ్చిన అనంతరం నర్సారెడ్డి తన తలను గోడకు బాదుకున్నాడు. అంతటితో ఆగక హెల్మెంట్ తో తన తలను తీవ్రంగా కొట్టుకున్నట్లు తెలుస్తోంది. తీవ్ర రక్త స్రావం కావడంతో నర్సారెడ్డి కూడా ఇంట్లోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -