Chandrababu Nomination: చంద్రబాబు నాయుడు నామినేషన్.. చరిత్రలో తొలిసారి ఈ విధంగా జరగబోతుందా?

Chandrababu Nomination: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ విజయం అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఏడుసార్లు కుప్పం నుంచి పోటీ చేయగా ఏడుసార్లు ఘనవిజయం సాధించారు. ఇప్పుడు ఎనిమిదవ సారి కూడా ఈయన కుప్పంలో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కుప్పంలో టిడిపి జెండా ఎగురుతుంది. 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కుప్పంలో టీడీపీ జెండానే ఎగురుతోంది. 1983 ఎన్నిక‌ల్లో ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా పేరున్న ఎన్‌. రంగ‌స్వామి నాయుడు తొలిసారి టిడిపి నుంచి పోటీ చేశారు.

ఇక ఈయన గెలవడంతో మరో దఫా ఎన్నికలలో కూడా ఆయనకే అవకాశం ఇచ్చారు.ఇలా మొద‌లైన టీడీపీ ప్ర‌స్థానం.. ఇక‌, 1989 ఎన్నిక‌ల నుంచి కుప్పంలో అస‌లు తిరుగే లేద‌న్న‌ట్టుగా ముందుకు సాగింది. అప్ప‌టి నుంచి ఇప్పటివరకు అక్కడ టిడిపి జెండా మాత్రమే ఎగురుతుంది అయితే ఎప్పుడు టిడిపికి కుప్పంలో నామినేషన్ వేసిన చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలోని స్థానికుల చేత నామినేషన్ వేయించేవారు.

ఇక ఈసారి మాత్రం కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా విభిన్నంగా నామినేషన్ వేయించారు. స్వయంగా తన సతీమణి నారా భువనేశ్వరి చేతుల మీదగా నామినేషన్ ను వేయించారు. ముందుగా నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు నామినేషన్ పట్టాలను స్థానికులతో కలిసి స్థానిక ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో పత్రాలను ఉంచి పూజలు చేయించారు అదేవిధంగా ఆ పత్రాలను మసీదులోనూ అలాగే చర్చిలో కూడా పెట్టి పూజలు చేశారు.

ఇలా ప్రతి చోట పూజలు చేయించిన అనంతరమే భువనేశ్వరి చేతుల మీదుగా చంద్రబాబు నాయుడు నామినేషన్ పట్టాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతులకు అప్పగించారు. ఇలా ఎప్పుడూ లేనివిధంగా ఈసారి చంద్రబాబునాయుడు తన నామినేషన్ చాలా విభిన్నంగా వేయించారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి కుప్పం గెలుపు పై చంద్రబాబు నాయుడు ఫోకస్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -