Prabhas: నైజాంలో ప్రభాస్ సినిమాకు భారీ షాక్.. ఏం జరిగిందంటే?

Prabhas: ఒక సినిమా విడుదల చేయాలంటే షూటింగ్ వరకు ఒక ఎత్తు అయితే దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడం మరో ఎత్తు. మిగిలిన ప్రదేశాలలో డిస్ట్రిబ్యూషన్స్ అంత కష్టమేమీ కాదు గాని నైజాంలో మాత్రం ఒక సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే పెద్ద తలనొప్పే.అక్కడ ఉన్న మూడు నాలుగు పార్టీలలో రెండు ఆసక్తి చూపకపోగా మిగిలిన రెండు ఎక్కువ డబ్బులకు బేరాలు మొదలుపెడతాయి. అక్కడినుంచి ఇంక బేరాల గేమ్ మొదలవుతుంది. మీటింగ్ల మీద మీటింగ్ లు పెడతారు.

ఇక, ముందు నుంచే కొంచెం నెగిటివ్ టాక్ గా నడుస్తున్న సినిమాలకి ఇంకా ఎక్కువ బేరాలు మొదలవుతాయి. ప్రభాస్ సినిమాకు ఇప్పుడు అదే గతి వచ్చేలాగా ఉంది. ప్రభాస్, ఆదిపురుష్ సినిమా చేస్తున్నారు అని చెప్పినప్పుడు ప్రజలందరిలోని తెలియని ఉత్సాహం కనబడింది. ఎన్నో రోజులు ఎదురు చూడగా ఒక టీజర్ విడుదల చేశారు సినిమా బృందం. కానీ అది ఎవ్వరి అంచనాలను తాకలేక పోయింది. ప్రేక్షకులందరూ నిరాశ చెందారు.

 

విఎఫ్ఎక్స్ బాలేదు అని, ప్రభాస్ అందం పోయింది అని నానా రకాలుగా కామెంట్స్ చేశారు. అప్పటికే ఈ సినిమా మీద అందరికీ ఆశలు పోయాయి. కానీ ఈ చిత్ర బృందం కొన్ని రోజులు టైం తీసుకుని మొన్న మొన్ననే ట్రైలర్ విడుదల చేశారు. టీజర్ కన్నా ఎన్నో రెట్లు బాగుంది ట్రైలర్. ప్రేక్షకులకు మళ్లీ ఈ సినిమా మీద ఆశ మొదలైంది. ఇంకో రెండు వారాలలో విడుదల అవుతున్న ఈ సినిమాకి డిస్ట్రిబ్యూషన్స్ పనులు సాగుతున్నాయి. ఇదే విధంగా నైజాం లో కూడా సినిమా డిస్టర్బ్యూషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడ పెద్ద గందరగోళం అయ్యింది.

 

ఆసియన్ సునీల్ తన చేతిలో ఉన్న థియేటర్ల ను ఇవ్వడానికి ఆసక్తి చూపించడం లేదు. దిల్ రాజు కూడా ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నాడు. అటు కాక ఇటు కాక మిగిలిపోయింది మైత్రి మూవీ మేకర్స్ మాత్రమే. కానీ దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒక మాట మీదకు వచ్చారు అని తెలిసింది. దీనివల్ల ఆదిపురుష్ మూవీ మేకర్స్ కు కఠినమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎదురవుతున్నాయి. మొత్తంగా 60 కోట్లకు నైజం ఏరియాలో కోట్ చేశారు.

 

50 కోట్లు నాన్ రికవరబల్ అడ్వాన్స్, 10 కోట్లు రికవరబల్ అడ్వాన్స్ ఇవ్వడానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒప్పుకున్నట్టు ఉంది. కానీ బేరాలు అక్కడితో ఆగడం లేదు. ఈ సినిమాకు ఒకవేళ నష్టం వస్తే భవిష్యత్తులో వచ్చే పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా మారుతి మరియు ప్రభాస్ సినిమాలు దగ్గర డబ్బులు కవర్ చేయాలి అంటూ కండిషన్స్ పెడుతున్నారు. ఇవన్నీ ఒప్పుకోవడం కన్నా వేరే మార్గం కోసం ఆలోచిస్తుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -