YSRCP: వైసీపీ బూతు లీడర్లకు వరుస షాకులు.. చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనా?

YSRCP: వైసీపీలో మంత్రులు కావాలంటే బూతులు తిట్టాలి. టికెట్ రావాలంటే దుర్భాషలాడాలి. ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ ప్రచారం జోరుగా నడుస్తోంది. అయితే.. అలాంటి భ్రమల్లో ఉన్న నేతలంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు, పవన్ ను తిడితే వైసీపీలో తమ సీటు ఫదిలం అని చాలా మంది అనుకునే వారు. అందుకే అవకాశం దొరికిన ప్రతీసారి చంద్రబాబు, పవన్ ను వ్యక్తిగతంగా దూషించడానికి ప్రెస్‌మీట్లు పెట్టి స్వామి భక్తి చాటుకునేవారు. అయితే ఇలాంటి బూతు మాస్టర్లకు షాకులు తప్పేలా లేవు. ఐపాక్ సర్వేల పేరుతో జగన్ వారందరికీ టికెట్ నిరాకరించడమో.. లేదంటే.. వేరే స్థానానికి పంపడమో చేస్తున్నారు.

చంద్రబాబు చెవి దగ్గర జోరీగలా ఉన్న నేతల్లో కొడాలినాని, వల్లభనేని వంశీ ముందుంటారు. అయితే వీరిద్దరికీ సిట్టింగ్ స్థానం కట్ అని తెలుస్తోంది. కొడాలినానిని గన్నవరం నుంచి పోటీ చేయాలని జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే, దాన్ని నాని సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. నాని ఎక్కడికి వెళ్లేదే లేదు. గుడివాడ నాని అడ్డా అని అంటున్నారు. అయితే, ఇంతలోనే కొడాలి వర్గానికి షాక్ ఇచ్చేలా గుడివాడ సర్కిల్స్‌లో కొత్త ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థి మండల హనుమంతురావు అని పెద్ద ఎత్తున బ్యానర్లు వెలిశాయి. సీఎంలో నుంచి హనుమంతురావుకి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయనతోపాటు మెరుగుమాల కాళీకి పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తారో తెలియదు కానీ.. నానికి అయితే గన్నవరం నుంచి పోటీ చేయాల్సిందేనని జగన్ తేల్చి చెప్పారట. దీంతో.. నానిలో టెన్షన్ మొదలైందని సొంతపార్టీ నేతలే చెబుతున్నారు. అసలు ఏం చేయాలో తోచని స్థితిలో నాని ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

మరి నాని గన్నవరం నుంచి పోటీ చేస్తే వల్లభనేని వంశీ సంగతి ఏంటీ? ఆయనకు ఆసక్తి ఉంటే విజయవాడ ఎంపీగా బరిలో దించాలని అనుకుంటున్నారట. అంటే.. మొన్న వైసీపీలో చేరిన కేశినేని నానికి మొదట్లోనే మోసం ఎందురైంది. ఇలా చంద్రబాబుపై నానా బూతులు తిట్టిన కొడాలి నాని, వల్లభనేని వంశీకి ఆల్మోస్ట్ చిత్తడి అయినట్టే తెలుస్తోంది. ఇక వారి తర్వాత మంత్రి రోజా.. ఆమె చూస్తే మనిషి ఇంత స్వేచ్చ ఉంటుందా? అని కూడా అనిపిస్తుంది. పైగా తిట్టడానికి ఇంత స్వతంత్ర్యం ఉంటుందా? అని అనుమానం రాక మానదు. కేవలం జగన్న దగ్గర మార్కులు కొట్టడానికి చంద్రబాబు, లోకేష్, పవన్ ను నోటికొచ్చినట్టు తిట్టింది రోజా. ఇప్పుడు ఆమె సీటుకు కూడా ఎసరు వచ్చింది. అయితే, ఆమెకు ఎసరు పెట్టింది ఎవరో కాదు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అది ఆమెకు కూడా తెలుసు. చంద్రబాబు, పవన్ పై పెట్టిన దృష్టి స్వపక్షంలో విపక్షంపై పెడితే.. రోజాకు ఈ పరిస్థితి వచ్చేది కాదని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

వీరి తర్వాత జోగి రమేష్‌కు మైకు దొరికితే.. కోతికి కొబ్బరికాయ దొరికినట్టే ఉంటుంది. ఆయన ఏం మాట్లాడుతారో.. ఎందుకు మాట్లాడుతారో తెలియదు. కానీ, జగన్ దగ్గర మార్కులు కొట్టాలి అని మాత్రం అనుకుంటారు. అసెంబ్లీలోనే ఆయన భూతులు మాట్లాడారు. అలాంటి వ్యక్తికి కూడా నో టికెట్ అనేశారు. కావాలి అనుకుంటే పెనుమలూరు నుంచి పోటీ చేయాలని చెప్పేశారు. దీంతో.. ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేతలు ఎవరూ వేరే పార్టీల్లోకి చేరే పరిస్థితి లేదు. జగన్ మెప్పు కోసం విపక్షాలను నోటికొచ్చినట్టు తిట్టారు. దీంతో.. ఆ పార్టీలకు అవసరం ఉన్నా.. వీరిని తీసుకునే పరిస్థితి లేదు. దీంతో.. జగన్ చెప్పిన దగ్గర పోటీ చేయడం. చేతకాకపోతే రాజకీయ సన్యాసం తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -