Prudhvi Raj: థర్టీ ఇయర్స్ పృథ్వీకి దెబ్బ మీద దెబ్బ.. భార్యకు భరణం ఇవ్వాలంటూ?

Prudhvi Raj: తెలుగు రాష్ట్రాల ప్రజలకు నటుడు పృథ్వీరాజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఒక డైలాగ్ తో మరో స్థాయిలో ఫేమస్ అయ్యాడు పృధ్వీరాజ్. పెళ్లి సినిమాతో నటుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పృథ్వీ ఆ తర్వాత నరసింహారెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, దేవుళ్ళు వంటి సినిమాల్లో నటించి నటుడుగా తెలుగు నాట తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు.

ఇక పృధ్వీరాజ్ తన అద్భుతమైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవాడు. ఇక పెళ్లి సినిమాలో విలన్ పాత్రకు ఉత్తమ విలన్ గా నంది అవార్డు సొంతం చేసుకున్నాడు పృధ్వీరాజ్. ఇక పృధ్వీరాజ్ భార్య పేరు బినా. వీరిద్దరికీ ఆహెద్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇక 2005లో పృథ్వీరాజ్ బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో తన కొడుకుని ఇబ్బందులకు గురి చేశారంటూ అక్కడ సెక్యూరిటీ సిబ్బందిపై ఫిర్యాదు చేశాడు. అప్పట్లో ఇది చాలా హాట్ టాపిక్ గా మారింది.

ఇక పృధ్వీరాజ్ సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అప్ డేట్స్ సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ఇక ఇండస్ట్రీలోనే కాకుండా పృథ్వీరాజ్ రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకుంన్నాడు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హడావిడి చేస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా పృథ్వీరాజ్ కు సంబంధించిన ఒక విషయం నెట్టింట్లో తెగ హడావిడి చేస్తుంది.

ఇటీవల పృథ్వీరాజ్ వైసీపీ లో తన పదవిని పోగొట్టుకున్నాడు. ఇలా మూలిగే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు పృధ్విరాజ్ కు మరో గండం ఎదురైందట. పృధ్విరాజ్ భార్య భరణం ఇవ్వాలని తనను కోరుతుందట, మరి ఎందుకో ఏమిటో గాని.. పృధ్విరాజ్ కు తన భార్య నుంచి కూడా కొత్త సమస్యలు తలెత్తయట. ప్రస్తుతం పృథ్వీరాజ్ కు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు పృధ్వీరాజ్ విషయం లో తన భార్యకు వచ్చిన చిక్కు ఏమిటి అని కొందరు ఆలోచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -