Bigg Boss 6: బిగ్ బాస్ షో నుంచి ఆమె ఎలిమినేట్.. రచ్చరచ్చేనా?

Bigg Boss 6: మునపటి కంటే బిగ్‌బాస్ షో ఇప్పుడు ఫుల్ జోష్‌లో నడుస్తోంది. నిన్న మొన్నటివరకు కంటెస్టెంట్లు ఆట మీద పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ ఇప్పుడిప్పుడే గేమ్‌ రసవత్తరంగా సాగుతోంది. ఆడియన్స్ కూడా ఈ షో చూడటానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ షో ఇప్పటివరకు 11 వారాల ఎలిమినేషన్లు పూర్తి చేసుకుంది. కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవ్వడంతో హౌస్‌లో ఉన్న చెత్త మొత్తం బయటకు వెళ్లిపోయిందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ రౌండ్స్ రసవత్తరంగా సాగడంతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు గేమ్‌పైనే దృష్టి పెడుతున్నారు. ఎలాగైనా బిగ్‌బాస్-6 టైటిల్ కొట్టాలనే కసిలో ఆడుతున్నారు.

 

 

అయితే గత వారం మెరీనా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆమె హౌస్ నుంచి బయటికి వెళ్లడంతో రోహిత్ టాప్ ప్లేస్‌లోకి చేరాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ టాస్క్ ఎంతో టఫ్‌గా కొనసాగుతోంది. అయితే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఆదిరెడ్డి, రోహిత్, శ్రీహాన్, రాజ్, శ్రీసత్య, ఫైమా, ఇనయా ఉన్నారు. రేవంత్ కెప్టెన్‌గా ఉండటంతో నామినేషన్‌ నుంచి సేఫ్ అయ్యాడు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్, ఇతర మీడియా నిర్వహించిన వెబ్‌పోల్స్ లో ఇనయా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఆదిరెడ్డి, రాజ్ ఉన్నారు. ఫైమా, శ్రీసత్య చివరి స్థానాల్లో ఉన్నారు. అయితే ఫైమా సేఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ నెటిజన్లు ఈ వారం శ్రీసత్య ఎలిమినేట్ అవ్వడం ఖాయమంటున్నారు. ఒకవేళ శ్రీసత్య ఎలిమినేట్ అయితే బిగ్‌బాస్‌కు పట్టుకున్న దరిద్రం పోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, మంగళవారం ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల ఫ్యామిలీని తీసుకొచ్చింది. ఆదిరెడ్డి భార్య, కూతురు, రాజ్ తల్లి వచ్చారు. బుధవారం ఎపిసోడ్‌లో ఫైమా తల్లి షాహీదా, శ్రీసత్య.. తల్లీతండ్రి వచ్చారు. టీఆర్‌పీ కోసం బిగ్‌బాస్ ఫ్యామిలీ సెంటిమెంట్‌ను ట్రై చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -