Chandrababu: చంద్రబాబు విషయంలో ఏకంగా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయా?

Chandrababu: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పై పెద్ద ఎత్తున కుట్ర జరగబోతుందని తెలుస్తుంది.ఇలా చంద్రబాబు నాయుడు పై కుట్ర జరుగుతుందనడానికి కారణం స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యల కారణమని చెప్పాలి చంద్రబాబు నాయుడుని ఫినిష్ చేస్తామంటూ ఒక స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అధికార ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పై కుట్రలు చేయడానికి పథకాలు రచిస్తోందని స్పష్టంగా అర్థం అవుతుంది.

కేవలం తమ్మినేని చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు బయటకు ఎక్కడికి వచ్చిన ఆయన పట్ల జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఇందుకు నిదర్శనం అని తెలుస్తుంది.  కొద్ది రోజుల క్రితం యర్రగొండపాలెంలో టీడీపీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ సభలో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిని సెక్యూరిటీ అడ్డుకుంటున్నప్పటికీ పెద్ద ఎత్తున రాళ్ల వర్షం కురవగా ఒక టిడిపి కార్యకర్త ఈ దాడికి గురై కొద్ది రోజులపాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించిన విషయం మనకు తెలిసింది.

 

ఇలా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక కారణం చేత ఆయనపై రాళ్ల దాడి జరుగుతుంది. అయితే ఇదంతా కూడా వైసిపి నేతలు పోలీసుల కనుసనలలోనే జరుగుతుందని తెలుస్తోంది. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఓ వ్యక్తిపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి అంటే అది కేవలం అధికార నేతల కనుసన్నలలో మాత్రమే జరుగుతుందని అర్థమవుతుంది.

 

ఇలా బహిరంగంగా చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీ నేతలు కుట్ర చేయిస్తున్నారని, పోలీసుల సహకారంతోనే ఇలాంటి దాడులకు ప్రణాళికలు వేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటున్నారు.
చంద్రబాబు సెక్యూరిటీలోకి పదే పదే ఇతర వాహనాలు వస్తున్నాయి. తరచూ అడ్డం పడుతున్నారు. చంద్రబాబు భద్రతను స్థానిక పోలీసులు సీరియస్ గా తీసుకోవడం లేదని తెలుస్తుంది. ఇలా ఈ వ్యవహారాలన్నీ కనుక చూస్తే చంద్రబాబు నాయుడు పై అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున దాడికి పాల్పడుతూ తనపై కుట్రలు చేస్తున్నారని అర్థమవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -