balayya: బిగ్ బాస్ కు బాలయ్య కండీషన్లు వింటే గుండె గుభేల్!

balayya: ఇప్పుడు సినిమాల కంటే రియాలిటీ షోలో ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ 6 ఈ మధ్యనే ముగిసింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7కు సంబంధించి చర్చలు మొదలయ్యాయి. బిగ్ బాస్ షోకు సంబంధించి వరుసగా నాలుగు సీజన్లకు నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించారు. అందుకే ఆ షోకు సంబంధించి కాస్త వేడి తగ్గిందని, పాపులారిటీ కూడా కాస్త తగ్గిందని పలువురు చర్చించుకుంటున్నారు. ఈసారి బిగ్ బాస్ కు వేరే హోస్ట్ ఉంటారనే టాక్ కూడా వినిపిస్తోంది.

 

బిగ్ బాస్ షో సీజన్7కు హోస్ట్ గా వ్యవహరించడానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ షో బాలయ్యకు అద్భుతమైన పేరు తీసుకొచ్చింది. ఈ తరుణంలో బాలయ్య మరికొన్ని రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. అయితే తాను పెట్టే షరతులకు ఓకే చెబితేనే ఆయన బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉంటానని తెలిపినట్లు సమాచారం.

నాగార్జునకు బిగ్ బాస్ షోకు హోస్ట్ గా కొనసాగడం ఇష్టం లేకపోవడంతో బాలయ్యకు ఈ లక్కీ ఛాన్స్ వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఒక వేళ తాను బిగ్ బాస్ షోకు హోస్ట్ గా పని చేసినా అదే టైంలో అన్ స్టాపబుల్ షోకు కూడా హోస్ట్ గా ఉంటానని బాలయ్య చెప్పినట్లు వినిపిస్తోంది.

 

అయితే తాను హోస్ట్ గా వ్యవహరిస్తే అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ సెట్ వేయకూడదని కూడా బాలయ్య తెలిపినట్లు బోగట్టా వినిపిస్తోంది. ఈ షరతులకు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోలో హోస్ట్ గా పనిచెయ్యడానికి బాలయ్యకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కావడానికి ఇంకా ఏడెనిమిది నెలల సమయం ఉంది.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -