SriSatya: బిగ్‌బాస్ నుంచి శ్రీసత్య ఔట్.. చివరి వీక్‌లో ఊహించని పరిణామాలు

SriSatya: బిగ్‌బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకుంది. ఈ వారంలో షోకు ఎండ్ కార్డు పడనుంది. దీంతో సీజన్ 6 రసవత్తరంగా మారింది. ఎవరు టైటిల్ గెలుస్తారనే దానిపై బిస్ బాస్ ప్రేక్షకుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయి చివరికి ఆరుగురు కంటెస్టెంట్లు హౌస్‌లో మిగిలిపోయారు. షో ఫైనల్ వీక్‌కు చేరుకోవడంతో ఫైనల్‌కు ఆరుగురు చేరుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ వారం మధ్యలో ఆరుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.

 

మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? టాప్ 5లో ఎవరు నిలుస్తారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. మిడ్ వీక్‌లో శ్రీసత్య ఎలిమినేట్ అయిందని తెలుస్తోంది. గురువారం శ్రీసత్య ఎలిమినేట్ ఎపిసోడ్ ప్లే కావొచ్చని అంటున్నారు. బుధవారమే శ్రీసత్య ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్లే అవుతుందని అనుకున్నారు. కానీ శ్రీహన్, కీర్తిల బిగ్ బాస్ జర్నీని మాత్రమే చూపించారు. దీంతో గురువారం శ్రీసత్య ఎలిమినేషన్ ఎపిసోడ్ ఉంటుందని బిగ్ బాస్ ప్రేక్షకులు చెబుతున్నారు.

 

లాస్ట్ వీక్ తర్వాత హౌస్‌లో కేవలం ఆరుగురు వ్యక్తులు మాత్రమే ఉండటంతో.. ఆదిరెడ్డి, శ్రీసత్య,కీర్తిలలో ఎవరో ఒకరిని మిడ్ వీక్ లో ఎలిమినేట్ చేసే అవకాశముందని బిగ్ బాస్ ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే గత వీక్ లోనే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, శ్రీసత్య ఎలిమినేట్ అవుతుందని అందరూ భావించారు. కానీ ఇనయ ఒక్కరినే ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్.. షోను చివరి వారంలో ఇంట్రెస్ట్ గా మార్చేందుకు మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టినట్లు చెబుతున్నారు.

 

శ్రీసత్య ఓటింగ్ లో అందరికంటే చివరిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రారంభంలో శ్రీసత్య అంతగా ఆకట్టుకోలేదు. సైలెంట్‌గా ఉంటూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయలేకపోయింది. ఆ తర్వాత నాగార్జున క్లాస్ తీసుకున్నారు. గేమ్ ఎందుకు ఆడటం లేదని ప్రశ్నించాడు. దీంతో అప్పటినుంచి శ్రీసత్య తన గేమ్ ప్లాన్ ను పూర్తిగా మార్చుకుంది. అబ్బాయిలతో పోటీ పడి గేమ్ ఆడింది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -