Bigg Boss 6: బిగ్ బాస్6 ఫినాలే రేటింగ్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Bigg Boss 6: బిగ్ బాస్ దేశంలో అత్యంత పాపులర్ అయిన షోలలో ఒకటి. ఇంగ్లీష్ లో బాగా పాపులర్ అయిన ఈ ప్రోగ్రామ్ ఇండియా కి వచ్చింది. హిందీ లో దీన్ని మొదటగా ప్రారంభించారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ 16వ సీజన్ నడుస్తుంది. హిందీ తరువాత ఇతర భాషల్లోకి కూడా వెళ్ళింది ఈ షో. దక్షిణ భారత భాషలోకి కూడా బిగ్ బాస్ మొదలయింది.

 

ఇక తెలుగు విషయానికి వస్తే మొదటి సీజన్ భారీ ఎత్తున మొదలయ్యింది. టాలెంటెడ్ హీరో జూనియర్ హీరో దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం ప్రధాన కారణం. తనలో ఉన్న ఇంకొక కోణాన్ని చూపించాడు నందమూరి చిన్నోడు బిగ్ బాస్ షో తో. ఎన్టీఆర్ మంచి నటుడు అని అందరికీ తెలిసిందే. కానీ తనలో కూడా ఒక మంచి హోస్ట్ ఉన్నాడని నిరూపించాడు తారక్.

 

మొదటి సీజన్ ని హోస్ట్ చేసిన తారక్ తరువాత ఎందుకనో ఆ షో వైపు చూడలేదు. సెకండ్ సీజన్ కి నాచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. మూడవ సీజన్ కింగ్ నాగార్జున నడిపారు. అప్పటి నుంచి ఆయనే హోస్ట్ గా ఉంటున్నారు. ఇటీవల ప్రోగ్రామ్ 6వ సీజన్ కూడా పూర్తి చేసుకుంది.

 

అయితే బిగ్ బాస్ షో మెల్లిగా తన పాపులారిటీ కోల్పోతుంది అంటున్నారు విశ్లేషకులు. సీజన్ 6 అంతగా ప్రభావం చూపలేకపోయింది అంటున్నారు. ఓపెనింగ్ ఎపిసోడ్ కానీ గ్రాండ్ ఫినాలే కానీ పెద్దగా TRP సాధించలేకపోయింది. ఓపెనింగ్ ఎపిపోడ్ 8.86 TRP సాధించగా ఫినాలే 8.17 TRP రికార్డ్ సాధించింది. దీనికి కారణం ఏంటంటే. బిగ్ బాస్ షోలో అడుగు పెట్టిన వారు అంతగా గుర్తింపు ఉన్నవాళ్ళు కాదు. కొంత మందిని మినహాయిస్తే మిగతావారు పెద్దగా పాపులర్ కారు. పేరున్న కంటెస్టెంట్స్ మధ్యలోనే బయటికి రావడం. నాగార్జున హోస్టింగ్ మొనాటనస్ గా చాలా మందికి అనిపించడం కూడా ఒక కారణం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -