Bigg Boss 6: బిగ్ బాస్ లో అలాంటి చెత్త పనులు చేయాలని చెప్పారట!

Bigg Boss 6:తెలుగులో ఎంతో విజయవంతంగా రన్ అవుతున్న రియాల్టీ షోలలో బిగ్ బాస్ షో ఒకటి. నిజానికి బిగ్ బాస్ గత సీజన్లు అన్నీ ఎంతో విజయవంతంగా టెలీకాస్ట్ కాగా.. తాజాగా నడుస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 మాత్రం కాస్త అటుఇటుగా సాగుతోంది. పెద్దగా పరిచయం ఉన్న జనాలు లేకపోవడం, బిగ్ బాస్ హౌజ్ లోని వారికి పెద్దగా ఆడటానికి రాకపోవడంతో పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు.

 

మరోపక్క బిగ్ బాస్ సీజన్ 6 లో అప్పుడప్పుడు లవ్ ట్రాకులు నడుస్తున్నా అవి ఎందుకో జనాలకు మాత్రం కనెక్ట్ అవడం లేదు. దీంతో సీజన్ 6 బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ అంతకంతకు తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలోనే బిగ్ బాస్ మీద విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ అనేది ఓ బ్రోతల్ హౌజ్ అని సీపీఐ నారాయణ గతంలో ఘాటుగా విమర్శించడం తెలిసిందే.

 

తాజాగా బిగ్ బాస్ గురించి వివాదాస్పద యాంకర్ శ్రీరెడ్డి స్పందించింది. తనకు కూడా బిగ్ బాస్ లో రావడానికి అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే తనకు బిగ్ బాస్ నిర్వాహకుల నుండి ఓ హోటల్ కు రమ్మని ఆహ్వానం అందిందని, సరే వెళదాం అని అక్కడికి వెళ్లినట్లు శ్రీరెడ్డి వివరించింది.

 

బిగ్ బాస్ లో పాల్గొనడానికి తనకు భారీగానే డబ్బులు ఆఫర్ చేశారని కానీ బిగ్ బాస్ లో రిలేషన్ షిప్ మెయింటెన్ చేయాలని చెప్పడంతో షాక్ అయ్యానని శ్రీరెడ్డి తెలిపింది. దీంతో ఖంగుతిన్న తాను.. అలాంటి ఛండాలమైన, చెత్త పనులు చేయనని తేల్చి చెప్పిందట. అలాగే తాను బిగ్ బాస్ షోకి చచ్చినా వెళ్లకూడదని కూడా నిర్ణయించుకుందట.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts