Bigg Boss: గుండె పగిలేలా ఏడ్చిన గీతూ.. కన్నీళ్లు పెడుతూ?

Bigg Boss: బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గెలుపు కోసం అలుపెరుగని విధంగా గేమ్ ఆడిన గీతూ రాయల్ కు చేదు అనుభవం మిగిలింది. ఏది ఏమైనా గెలిచి తీరాలన్న కసితో ఆడినా ప్రయోజనం దక్కలేదు. నిద్రలోనూ బిగ్ బాస్ నే కలవరిస్తూ గడిపింది. ఎన్ని విమర్శలొచ్చినా ఎవరేమనుకున్నా గేమ్ లో తగ్గేదే ల్యా.. అంటూ ముందుకెళ్లినా ఫలితం లేకపోయింది.

 

తొమ్మిది వారాలు గేమ్ లో కొనసాగిన గీతూ రాయల్.. హౌస్ నుంచి వెళ్లి పోవాల్సి వచ్చింది. ఊహించని రీతిలో తన ఎలిమినేషన్ జరగడంతో ఆమె భరించలేకపోయింది. గుండె పగిలినంత పని అయ్యింది. గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయే చివరి క్షణాల్లో హృదయం ద్రవించేలా మాట్లాడింది. హోస్ట్ నాగార్జున ఎంట్రీతోనే హౌస్‌మేట్స్‌తో ఓ ఆట మొదలు పెట్టించాడు. మీ గేమ్‌లో పాములా కాటేసేది ఎవరో? నిచ్చెనలా సాయం అందించేది ఎవరో చెప్పాలన్నాడు. దానికి అందరూ రకరకాలుగా స్పందించారు.

 

నాగార్జున ఇనయపై ప్రాంక్ ప్లే చేశాడు. ఎవరి కోసం నువ్వు ఎదురుచూస్తున్నావో తనకు తెలుసంటూ వ్యాఖ్యానించాడు. తర్వాత సీక్రెట్‌ గది తెరవాలని చెబుతాడు. దీంతో ఆమె పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ సూర్య ఫొటో మాత్రమే కనిపిస్తుంది. అనంతరం దానికి ముద్దులు పెట్టి భావోద్వేగానికి గురవుతుంది. ఇనయ అనుకుంటున్నట్లుగా సూర్య రహస్య గదిలో లేడని నాగ్ చెబుతాడు. ఇంట్లో బుజ్జమ్మతో కలిసి ఉన్నాడంటూ ఫ్రాంక్ చేస్తాడు.

 

గీతూ ఎమోషనల్.. ఏడ్చేసింది..
ఇక నామినేషన్లలో ఉన్న అందరినీ కాపాడుకుంటూ వస్తాడు. ఆఖరికి గీతూ, సత్య మిగిలిపోతారు. ఇక గీతూ.. యూ ఆర్ ఎలిమినేటెడ్ అంటూ ప్రకటన వస్తుంది. దీంతో గీతూ బాగా ఎమోషనల్ అవుతుంది. తాను బాధపెట్టి ఉంటే ఐయామ్‌ వెరీ సారీ అంటూ గీతూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. తనకు బిగ్‌బాస్‌ ఇచ్చిన గిఫ్ట్‌ అంటూ ఆదిని హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఐ లవ్‌ యూ బిగ్‌బాస్‌.. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను… ప్లీజ్ నాకు హౌస్ నుంచి వెళ్లిపోవాలని లేదంటూ.. బోరున విలపిస్తుంది. ఇక ఆ తర్వాత గీతూ వెళ్లిపోతున్న సమయంలో రేవంత్‌, ఫైమా, సత్య, శ్రీహాన్‌, బాలాదిత్య, ఆదిరెడ్డి అందరూ తీవ్ర దుఃఖంతో చూస్తూ ఉండిపోతారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -