Sarayu: బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేసిన సరయు.. ఫేక్ అంటూ?

Sarayu: బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ కార్యక్రమం తెలుగులో ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఒక ఓటిటి సీజన్ కూడా పూర్తి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం గురించి మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్లి కేవలం ఒక వారం మాత్రమే హౌస్ లో ఉండి బయటకు వచ్చారు. అలాగే ఓటీటీలో ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ కూడా నాలుగు వారాలు తర్వాత ఈమె బయటకు వచ్చారు.. తాజాగా బిగ్ బాస్ కార్యక్రమం గురించి సరయు మాట్లాడుతూ బిగ్ బాస్ కార్యక్రమం ఒక చెత్త షో ఈ రియాలిటీ షో లన్ని ఫేక్. కొనుక్కొని లేదంటే వారి డబ్బు వారికే తిరిగి వెనక్కి ఇచ్చి మన అనుకునే వాళ్లని ప్రమోట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్లాట్ ఫామే ఈ రియాలిటీ షోలు.

 

ఇలాంటి వాటి ద్వారా మిమ్మల్ని మమ్మల్ని అందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు.దయచేసి ఇలాంటి షోలను చూసి మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటూ ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లి వచ్చాను కనుక మీకు ఈ విషయాలు చెబుతున్నాను.బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వారికి బయటనుంచి కాకుండా కొందరికి లోపల కూడా సపోర్ట్ ఉంటుందని తెలిపారు.

 

అలాంటి వారి కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది అలాంటి వారితో మనం పోరాడటం చాలా కష్టం వారితో ఫైట్ చేస్తేమనమే నెగిటివ్ అవుతామని అలాంటి వారితో ఫైట్ చేయడం వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతాం అంటూ ఈ సందర్భంగా సరియు బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ రన్ చేయడమే కాకుండా పలు సినిమాలలో నటిస్తూ వృత్తి పరమైన జీవితంలో బిజీగా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -