High Court: అది పోస్టుమార్టం చేయడమే.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు వైరల్!

High Court: ప్రముఖ బిగ్ బాస్ రియాల్టీ షోపై తాజాగా హైకోర్టు షాకింగ్ కామెంట్స్ చేసింది. షో ప్రసరానికి ముందు సెన్సార్షిప్ చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నించింది. ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టం చేయడం లాంటిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం షో ప్రసారం కావడం లేదన్న కారణంతో ఈ వ్యవహారంపై న్యాయస్థానం కళ్లు మూసుకుని ఉండలేదని పేర్కొంది. కేంద్రానికి తగిన సూచనలు ఇచ్చే విషయాన్నీ పరిశీలిస్తామని వెల్లడించింది. పిల్లి మెడలో గంట కట్టేదెవరనేది ఇక్కడ ప్రధాన విషయమని వ్యాఖ్యానించింది.

పూర్తి వివరాలతో కౌంటరు వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌, స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాటీవీ, ఎన్‌డేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ కార్పొరేషన్‌, సినీ హీరో అక్కినేని నాగార్జునలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసినట్లు తెలిపింది హైకోర్టు. కాగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అశ్లీలతను ప్రోత్సహించేదిగా బిగ్‌బాస్‌ షో ఉందంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి దాఖలు చేసిన రెండు ప్రజాహిత వ్యాజ్యలు బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. పిటిషనర్‌ తరఫున న్యాయవాది గుండాల శివప్రసాద్‌ రెడ్డి వాదనలు వినిపించారు.

 

సెన్సార్‌ లేకుండా షోను ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలను రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 లోపు ప్రసారం చేయాలన్నారు. ఎండేమోల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపిస్తూ.. ప్రస్తుతం బిగ్‌బాస్‌ షో ప్రసారం కావడం లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణ నిరర్ధకమన్నారు. ఇకముందు ప్రసారం కాబోయే కార్యక్రమంపై అభ్యంతరం ఉంటే తాజాగా పిల్‌ వేయడానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. బిగ్‌బాస్‌ లాంటి షో నచ్చకపోతే టీవీ ఛానల్‌ మార్చుకోవచ్చని పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ హక్కును నిరాకరించడానికి వీల్లేదని, అందువల్ల న్యాయస్థానం జోక్యం చేసుకునే పరిధి తక్కువ అని వివరించారు. అయితే ఈ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. అభ్యంతర ప్రసారాల విషయంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాలి. కార్యక్రమానికి ముందే సెన్సార్‌షిప్‌ లేకపోతే ఎలా? ఈ విషయంలో కేంద్రం తగిన నిర్ణయం తీసుకోవాలి. ప్రసారమయ్యాక అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనం? అది పోస్టుమార్టం చేయడమే అవుతుంది. ఒకవేళ ప్రతీ ఛానల్‌ అశ్లీలతతో కూడిన కార్యక్రమాలను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా? అందుకు యంత్రాంగం లేకపోతే ఎలా? నైతిక విలువలను కాపాడకపోతే ఎలా? అని ప్రశ్నలు సంధించింది.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -