Bigg Boss season 6: బిగ్ బాస్ రియల్ విన్నర్ శ్రీహాన్.. ప్రూఫ్ ఇదే!

Bigg Boss season 6: బుల్లితెర రియాలిటీ షో అయిన బిగ్ బాస్ షో సీజన్6 ముగిసింది. ప్రతి సారిలాగే ఈసారి కూడా మంచి సస్పెన్స్ మధ్య ఈ షో ఎండ్ అయ్యిందనే చెప్పాలి. విన్నర్ రేవంత్ అనే సంగతి అందరూ అనుకున్నారు. కానీ ప్రేక్షకుల ఓట్ల ప్రకారంగా చూస్తే రియల్ విన్నర్ శ్రీహాన్ అని హోస్ట్ నాగార్జున చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. స్వయంగా నాగార్జున ఈ విషయాన్ని వెల్లడించడంతో అందరూ దీనిని నమ్మాల్సి వస్తోంది. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున షోలో అందరి ముందూ వెల్లడించారు.

 

బిగ్ బాస్ అభిమానుల ఆలోచనలకు భిన్నంగా ఓటింగ్ జరిగిందని హోస్ట్ నాగార్జున చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకుని బిగ్ బాస్ హౌస్ నుంచి శ్రీహాన్ బయటకు రాకపోతే మాత్రం నాగార్జున బిగ్ బాస్ విజేతగా శ్రీహాన్ ను ప్రటించేవాడని సమాచారం. గత సీజన్లలో కూడా ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఓటింగ్ జరిగింది. బిగ్ బాస్ సీజన్3 టైంలో అయితే అందరూ శ్రీముఖి విజేత అవుతారని భావిస్తే అందుకు భిన్నంగా రాహుల్ సిప్లిగంజ్ విజేతగా బిగ్ బాస్ ప్రకటించారు.

శ్రీహాన్ బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ గా నిలిచినా ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచారని చెప్పొచ్చు. ఇక బిగ్ బాస్ హౌస్ లో సిరి ఏ తప్పులు చేసిందో ఆ తప్పులు శ్రీహాన్ చేయకపోవడం వల్ల అతను విజేతగా నిలిచారు. మరోవైపు శ్రీహాన్ కు భారీ స్థాయిలో ఓట్లు రావడం వెనుక సిరి హస్తం కూడా ఉందని సమాచారం. సిరి ఎంతో కష్టపడి తన భర్తకు ఓట్లు వేయించడం వల్ల శ్రీహాన్ కు రేవంత్ కంటే ఎక్కువగా ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది.

 

మరోవైపు బిగ్ బాస్ షో వల్ల శ్రీహాన్ పాపులారిటీ బాగా పెరిగిందనే చెప్పాలి. శ్రీహాన్ వరుస ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు ఆదిరెడ్డి ఫ్యాన్స్ మాత్రం పెయిడ్ బ్యాచ్ వల్ల ఆదిరెడ్డి విన్నర్ కాలేదని తెలుపుతున్నారు. కామన్ మ్యాన్ అయిన ఆదిరెడ్డి అక్కడి వరకు రావడం కూడా గొప్పేనని అభినందిస్తున్నారు. అలాగే భారీ మొత్తం ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన కీర్తి భట్ ను కూడా నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -