Seethakka-Revanth: సీతక్క విషయంలో రేవంత్ నిర్ణయమిదే.. అసలేం జరిగిందంటే?

Seethakka-Revanth: ఏంటి రేవంత్ సీతక్కను సీఎంగా చేయనున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డిని స్వయంగా ప్రకటించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. కాగా తెలంగాణ కాంగ్రెస్ లో భట్టి విక్రమార్కను ముందుకు తీసుకు రావడానికి రేవంత్ రెడ్డి వ్యతిరేకులంతా దళిత సీఎం అనే నినాదాన్ని ఎత్తుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వారందరికీ చెక్ పెట్టేందుకు వాట్ ఎబౌట్ గిరిజన సీఎం అంటున్నారు. అవసరం అయితే సీతక్కను సీఎంను అయినా చేస్తామని ప్రకటించేశారు.

ఆమెరికాలోని తానా సభల్లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చనీయాంశం అవుతున్నాయి. తానా సభల్లో కొంతమంది అడిగిన ప్రశ్నలకు రేవంత్ సమాధానం ఇచ్చారు. వెనుకబడిన వర్గాలు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని, అవసరం అయితే సీతక్కను సీఎంను చేసుకుంటామని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు యాధృచ్చికంగా అన్నవి కాదని తెలంగాణ కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం ఇటీవలి కాలంలో తెలంగాణ కాంగ్రెస్ సీఎం పదవి సమీకరణాలపై విస్తృత చర్చ జరుగుతుండటమే అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సాధారణంగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి సీఎం పదవి రేసులో ముందుంటారు.

 

అయితే కర్ణాటకలో మాదిరిగా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకుని ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటే వారిని సీఎం చేయాలనుకుంటే,ఎవరు రేసులో ముందుకొస్తారో చెప్పడం కష్టం. అదే సమయంలో దళిత సీఎం నినాదాన్ని కొంత మంది కాంగ్రెస్ నేతలు వినిపిస్తున్నారు. మల్లు భట్టి విక్రమార్క పార్టీ కోసం పాదయాత్ర చేశారని అంటున్నారు. అదే సమయంలో గిరిజనలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారని గిరిజనులను సీఎంను చేస్తే, కాంగ్రెస్ చరిత్ర సృష్టిస్తుందన్న వాదన వినిపిస్తున్నారు. దీంతో సీతక్క పేరు తెరపైకి వస్తోంది. రేవంత్ రెడ్డికి పదవి దక్కని పరిస్థితులు ఏర్పడితే గిరిజన కోటాలో సీతక్కను సీఎం ను చేసేందుకు ప్రతిపాదిస్తారని దానికి తగ్గట్లుగానే ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. భట్టి విక్రమార్కకు చెక్ పెట్టడం తనకు కాకపోతే,తన సోదరిగా చెప్పుకునే సీతక్కకు పదవి రావాలన్నది రేవంత్ ఆలోచన అన్న భావన వినిపిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -